Breaking News

పోలీసుల‌కి మాస్కుల‌ పంపిణీ

కామరెడ్డి, మే 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం కామారెడ్డి జిల్లా దోమకొండ మండల‌ కేంద్రంలోని పోలీస్‌ స్టేషన్లో పోలీసుల‌కి అఖిల‌ భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఎస్‌ఐ రాజేశ్వర్‌ గౌడ్‌ చేతుల‌ మీదుగా మాస్కులు పంపిణీ చేయడం జరిగిందని జిల్లా ఇంచార్జ్‌ మరియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంకం శ్యామ్‌ రావు అన్నారు.

ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు లాక్‌ డౌన్‌ నిబంధనలు పాటించాల‌ని, ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి సామాజిక దూరాన్ని పాటించి కరోనా మహమ్మారిని తరిమికొట్టాల‌ని అన్నారు. లాక్‌ డౌన్‌ నిబంధనలు పాటించని వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అన్నారు.

సమాచార హక్కు చట్టం 2005 అవగాహన సదస్సుతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో అఖిల‌ భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ జిల్లా ఇంచార్జ్‌ మరియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంకం శ్యామ్‌ రావు, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు మోతే లావణ్య , సాకేత్‌ పోలీస్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article