Breaking News

నెల‌కు 7,500 రూపాయల‌ ఆర్థిక సహాయం ఇవ్వాలి

బోధన్‌, మే 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్‌ డౌన్ వల‌న కార్మికులు, వల‌స కార్మికులు, చిన్న వ్యాపార వర్గాలు తీవ్ర ఇబ్బందులు పాలు అవుతున్నారని, కావున ప్రజల‌కు నెల‌కు రూ. 7,500 లు ఆర్థిక సహాయం, 50 కిలోల‌ బియ్యం ఇవ్వాల‌ని ఐఎఫ్‌టీయూ జిల్లా కార్యదర్శి బి మల్లేష్‌ డిమాండ్‌ చేశారు. ఐఎఫ్‌టీయూ తెలంగాణ రాష్ట్ర కమిటి పిలుపు మేరకు సోమవారం కరోనా మరియు రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్‌ డౌన్‌ నిబంధన ప్రకారం బోధన్‌ పట్టణం ఆర్డీవో కార్యాల‌యం ముందు నిరసన చేపట్టారు.

ఈ సందర్భంగా ఐఎఫ్‌టీయూ జిల్లా కార్యదర్శి బి మల్లేష్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 12వ తేది నుండి 21తారీఖు వరకు 10 రోజుల‌ లాక్‌ డౌన్‌ అకస్మాత్‌గా ప్రకటించడం జరిగిందని, దాంతో కార్మికులు, వల‌స కార్మికులు, చిన్న వ్యాపార వర్గాలు తీవ్ర ఇబ్బందుల పాలు అవుతున్నారని, కావున ప్రజల‌కు నెల‌కు ఏడున్నర వేల‌ రూపాయల‌ ఆర్థిక సహాయం, 50 కిలోల‌ బియ్యం ఇవ్వాల‌ని, కరోనానీ ఆరోగ్యశ్రీలో చేర్చాల‌ని, ప్రభుత్వం ప్రైవేట్‌ ఆసుపత్రుల‌ను స్వాదీనం చేసుకొని వైద్య సేవ‌లు అందించాల‌ని డిమాండ్‌ చేశారు.

కార్యక్రమంలో ఐఎఫ్‌టీయూ నాయకులు ద్యాకం పోశెట్టి, ల‌థీఫ్‌, బి.నాగమణి, పాషా బేగం, కమల‌క్క, గంగామని, పద్మ, సూర్యకళ, సావిత్రి, నాగమని తదితరులు పాల్గొన్నారు.

Check Also

ప్రజాస్వామ్యం ప్రమాదంలోకి నెట్ట బడుతుంది

బోధన్‌, మార్చ్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీజేపీ పాల‌నలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని ఐఎఫ్‌టీయూ జిల్లా ...

Comment on the article