Breaking News

ఆరోగ్య సర్వే పరిశీలించిన అదనపు కలెక్టర్ ల‌త

నందిపేట్‌, మే 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల‌ మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల‌ పరిధిలో జరుగుతున్న ప్రజారోగ్యం సర్వేను జిల్లా అధికారులు పరిశీలిస్తున్నారు. ఆయా కేంద్రాల‌ పరిధిలోని వైద్య ఆరోగ్య సిబ్బంది ప్రతి రోజు ఇంటింటికీ తిరుగుతూ ప్రజ ఆరోగ్యానికి సంబంధించిన సమస్యల‌ను తెలుసుకుంటూ, కరోన వైరస్‌పై తగిన అవగాహన కల్పిస్తున్నారు.

వన్నెల్‌, సిద్దాపూర్‌ గ్రామాల్లో జరిగిన సర్వేను జిల్లా అదనపు కలెక్టర్ ల‌త మంగళవారం క్షేత్ర స్థాయిలో ఇంటింటికి వెళ్లి పరిశీలించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ వైద్య బ ృందానికి ప్రజలు సహకరించి పూర్తి వివరాలు, తమకు ఉన్న సమస్యలు దాపరికం లేకుండ వివరించాల‌ని కోరారు. ప్రతి వెయ్యి మందికి ఒక బ ృందం చొప్పున సర్వే చేస్తున్నారని నందిపెట్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ అజయ్‌ తెలిపారు. పీహెచ్‌సీ పరిధిలోని ఉప కేంద్రాల‌ ఆధ్వర్యంలో వన్నెల్‌ కె, సిద్ధాపూర్‌ గ్రామాల్లో మంగళవారం ఇంటింటా సర్వే చేసినట్లు చెప్పారు.

ఇది వరకె మొదటి విడత సర్వే పూర్తి అయిందని ఆయన తెలిపారు. రెండో విడత సర్వే ఈ నెల‌ 17 నుంచి ప్రారంభించామన్నారు. కరోన ల‌క్షణాలున్నవారిని గుర్తించి వారిని ఇంట్లోనే ఉంచి చికిత్స అందిస్తారని చెప్పారు. ప్రతీ ఇంటిని వైద్య బ ృందం సందర్శించి కరోనా సమస్యను క్షేత్రస్థాయిలో నివారించడమే ల‌క్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ టీచర్లు, ఆశావర్కర్లు పాల్గొన్నారు.

మండలంలోని ఆయా గ్రామాల్లో వైద్య సిబ్బంది ఇంటింటికీ ఆరోగ్య సిబ్బంది వచ్చి ఇంట్లో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అని తెలుసుకుని వారికి ఇంట్లోనే వైద్యం పొందేలా వారికి మందుల‌ను అందిస్తామని ఆయన తెలిపారు. ఆరోగ్య సిబ్బంది, పంచాయతీ సిబ్బంది, అంగన్‌వాడి, ఆశా కార్యకర్తల‌తో కూడిన ముగ్గురు సభ్యుల‌తో ఉన్న బ ృందాలు ఇంటింటికి వెళ్లి జ్వర సర్వే చేశారు.

స్వ‌ల్ప‌ జ్వరం ల‌క్షణాలు ఉన్నవారి వివరాల‌ను నమోదు చేసుకున్నారు. కోవిడ్ ల‌క్షణాలు ఉన్న వారిని ఆస్పత్రికి వెళ్లి కరోనా టెస్టు చేసుకోవాల‌ని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల‌ సర్పంచులు, ఎంపీటీసీలు , వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ఏఎన్‌ఎంలు, సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

సిఎం కెసిఆర్‌ దేశానికి ఆదర్శం

నందిపేట, మే 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతదేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఉన్నత రాష్ట్రంగా అభివృద్ది పరచాలనే ...

Comment on the article