Breaking News

పేదల‌కు ఉచిత వైద్యం చేయాలి

బోధన్‌, మే 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో కరోనా సోకిన ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరియైన వైద్య సేవ‌లు అందక ప్రైవేట్‌ కార్పొరేటు హాస్పిటల్‌కు వెళ్ళితే, రోగుల‌ ప్రాణ భయ బల‌హీనతల‌ను ఆసర చేసుకొని ఇష్టానుసారంగా దోచుకుంటున్నారని, అందుకే హెల్త్‌ ఎమర్జెన్సీగా పరిగణించి, ప్రైవేట్‌ హాస్పటల్‌ను ప్రభుత్వం స్వాదీనం చేసుకొని ప్రజలందరికి ఉచిత వైద్య సేవ‌లు అందించాల‌ని ఐఎఫ్‌టీయూ జిల్లా కార్యదర్శి బి మల్లేష్‌ డిమాండ్‌ చేశారు.

ఐఎఫ్‌టీయూ తెలంగాణ రాష్ట్ర కమిటి పిలుపు మేరకు మంగళవారం బోధన్‌ పట్టణం తట్టికోట్‌లో ఇఫ్టూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బి.మల్లేష్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో లాక్‌ డౌన్ మూలంగా ఉపాధి కోల్పోయిన కార్మిక కుటుంభాలు ఒక దిక్కు పూట గడవడమే గగనంగా వుంటే, మరో దిక్కు కరోనా సోకితే ప్రభుత్వ ఆసుపత్రిలో సరియైన వసతులు లేకా ప్రైవేట్‌ హాస్పటల్‌కు వెళ్ళితే అక్కడ బిల్లుల‌కే గుండెలు గుభేల్‌ మని ఆగిపోతున్నాయని, అందుకే హెల్త్‌ ఎమర్జెన్సీగా పరిగనించి కోవిడ్‌-19 కు ప్రభుత్వ, ప్రైవేటు హాస్పటల్‌లో ఉచితంగా వైద్య సేవలు అందించాల‌ని, 50కిలోల‌ బియ్యం తో పాటు నెల‌కు రూ.7,500 ఆర్థిక సహాయం అందించాల‌ని బి.మల్లేష్‌ డిమాండ్‌ చేశారు.

కార్యక్రమంలో ఐఎఫ్‌టీయూ నాయకులు ఎన్‌.సాయులు, బి.నాగమణి, కర్ణ, మ‌ల్ల‌వ్వ, రమా, సుజాత, సావిత్రి, ల‌త, గంగామని, సరోజ తదితరులు పాల్గొన్నారు.

Check Also

ప్రజాస్వామ్యం ప్రమాదంలోకి నెట్ట బడుతుంది

బోధన్‌, మార్చ్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీజేపీ పాల‌నలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని ఐఎఫ్‌టీయూ జిల్లా ...

Comment on the article