Breaking News

పిహెచ్‌సి ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్‌

ఎడపల్లి, మే 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం ఎడపల్లి మండలం మంగల్‌ పాడు గ్రామంలో జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి ఆకస్మికంగా పర్యటించారు. ఈ సదర్భంగా కలెక్టర్‌ పిహెచ్‌సి సెంటర్‌లో ఓపి రిజిస్టర్‌ పరిశీలించారు. మెడికల్‌ సిబ్బందితో మాట్లాడుతూ డోర్‌ టు డోర్‌ సర్వేలో ఎంతమందికి ల‌క్షణాలున్న వారికి ఐసోలేషన్‌ కిడ్స్‌ ఇవ్వాల‌న్నారు. డోర్‌ టు డోర్‌ సర్వే పకడ్బందీగా చేయాల‌న్నారు.

అందరికీ ధర్మల్‌ స్క్రీనింగ్‌, పల్స్‌ ఆక్సి మీటర్‌తో చూడాల‌న్నారు. మంగల్‌ పాడులో కోవిడ్‌ పరీక్ష కేంద్రంను పరిశీలించారు. పరీక్షలు నిర్వహిస్తున్న సిబ్బందితో రోజు ఎంతమంది పరీక్షల‌కు వస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్‌ కొవిడ్ ల‌క్షణాలున్న వారి ఇండ్లకు వెళ్లి వారికి ఇచ్చిన హోమ్‌ ఐసోలేషన్‌ కిడ్స్‌ లోని మందుల‌ను పరిశీలించారు. ఏ టైంకు ఏ మందులు వాడుతున్నారు తెలుసుకున్నారు.

కోవిడ్‌ పేషెంట్‌తో కలెక్టర్‌ మాట్లాడి అధైర్య పడకండి పౌష్టిక ఆహారము మందులు వాడాలన్నారు. పేషెంట్లకు చాలా ఇబ్బందిగా ఉంటే పీహెచ్సీల‌కు పంపాల‌న్నారు. కోవిడ్ ల‌క్షణాలు ఉండి హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్న వారి ఫోన్‌ నెంబర్‌ తీసుకోవాల‌ని ప్రతిరోజు వారికి ఫోన్‌ ద్వారా మాట్లాడి ఆరోగ్యం గురించి తెలుసుకోవాల‌ని డే బై డే వారింటికి వెళ్లి ఇంటి వద్ద పరిశీలించి పేషెంటు మందులు వాడుతున్నారా తెలుసుకోవాల‌ని అంగన్వాడి, ఆశ పి.హెచ్‌సి సిబ్బందికి సల‌హాలు సూచనలు ఇచ్చారు.

కోవిడు పేషెంట్‌తో మర్యాదగా మాట్లాడాల‌ని సంతోషంగా ఉండే విధంగా మాట్లాడాల‌న్నారు. కలెక్టర్‌ వెంబడి బోధన్‌ ఆర్‌డిఓ రాజేశ్వర్‌, ఎడపల్లి తహసిల్దార్‌ ప్రవీణ్‌, ఎంపీడీవో శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article