Breaking News

Daily Archives: May 19, 2021

అంతరాష్ట్ర కార్మికుల‌ వివరాలు అందజేయాలి…

నిజామాబాద్‌, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల‌కు చెందిన కార్మికులు ఇతర రాష్ట్రాల‌లో పనిచేసి వారి స్వంత గ్రామాల‌కు తిరిగి వస్తే వారి దగ్గరలో ఉన్న, వారి పరిధిలో ఉన్న సహాయ కార్మిక అధికారుల‌కు వారి పూర్తి వివరాలు అందజేయాల‌ని ఉప కార్మిక కమీషనర్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పేరు, తండ్రిపేరు, వయస్సు, లింగము, ఆధార్‌కార్డు, రేషన్‌ కార్డు, మోబైల్‌ నెంబర్‌, గతంలో పనిచేసిన ప్రదేశం తదితర వివరాలు అందజేయాల‌న్నారు. అలాగే రెండు జిల్లాల్లోని ఇటుక‌ బట్టీల‌ ...

Read More »

టిఎస్‌పిఎస్‌సి సభ్యులు వీరే…

హైదరాబాద్‌, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌, సభ్యుల‌ను బుధవారం, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు నియమించారు. సిఎం కెసిఆర్‌ ప్రతిపాదన మేరకు గవర్నర్‌ ఆమోదించారు. చైర్మన్‌గా డా. బి. జనార్ధన్‌ రెడ్డి (ఐఎఎస్‌) (వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శిగా ప్రస్థుతం పనిచేస్తున్నారు) సభ్యులుగా రమావత్‌ ధన్‌ సింగ్‌ (బిటెక్‌ సివిల్‌, రిటైర్డ్‌ ఈఎన్సీ), ప్రొ. బి. లింగారెడ్డి (ఎమ్మెస్సీ పిహెచ్డీ, ప్రొ.హెడ్‌ డిపార్డ్మెంట్‌ ఆఫ్‌ ఫిజిక్స్‌ సిబిఐటి), కోట్ల అరుణ కుమారి (బిఎస్సీ బీఈడీ., ఎమ్మె ...

Read More »

టిఎస్‌పిఎస్‌సి సభ్యురాలిగా సుమిత్ర ఆనంద్‌

కామారెడ్డి, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టిఎస్‌పిఎస్‌సి తెలంగాణ స్టేట్‌ సభ్యురాలిగా సుమిత్ర ఆనంద్‌ చిన్నమల్లారెడ్డి (ఉపాధ్యాయురాలు) ని రాష్ట ముఖ్య మంత్రి కేసిఆర్‌ నియమించడం జరిగింది. పిఆర్‌టియు తెలంగాణ కామారెడ్డి ఆధ్వర్యములో బుధవారం ఘనంగా సన్మానించారు. కార్యక్రమములో జిల్లా అధ్యక్షుడు మనోహర్‌ రావు, ప్రధాన కార్య దర్శి ల‌క్ష్మీ రాజం, కామారెడ్డి మండలం అధ్యక్షుడు అశోక్‌, ఓపెన్‌ స్కూల్‌ జిల్లా కో ఆర్డినేటర్ తుల‌ రవీందర్‌ పాల్గొన్నారు.

Read More »

నళినికి డాక్టరేట్‌ ప్రదానం

డిచ్‌పల్లి, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాల‌యంలోని బిజినెస్‌ మేనేజ్‌ మెంట్‌ విభాగపు పరిశోధకులు జి. నళినికి పిహెచ్‌. డి. డాక్టరేట్‌ పట్టా ప్రదానం చేయబడింది. బిజినెస్‌ మేనేజ్‌ మెంట్‌ విభాగంలో ప్రొఫెసర్‌ కైసర్‌ మహ్మద్‌ పర్యవేక్షణలో పరిశోధక విద్యార్థి జి. నళిని ‘‘ది పాటర్న్‌ ఆఫ్‌ ఎంప్లాయీ ఎంగేజ్‌ మెంట్‌ ఇన్‌ ప్రైవేట్‌ సెక్టార్‌ బ్యాంక్స్‌ – ఎ సెలెక్ట్‌ స్టడీ’’ అనే అంశంపై పరిశోధన చేసి సిద్ధాంత గ్రంథం రూపొందించారు. ఓపెన్‌ వైవా వోస్‌ (వర్చువల్‌) ...

Read More »

అంగరంగ వైభవంగా ల‌క్ష్మినారాయణ స్వామికళ్యాణ మహోత్సవం

ఆర్మూర్‌, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ పట్టణం శ్రీ దత్తాత్రేయ ల‌క్ష్మినారాయణ స్వామి ఆయంలో ఎస్‌ఎస్‌కె సమాజ్‌ ఆధ్వర్యంలో బుధవారం ల‌క్ష్మినారాయణ స్వామి కళ్యాణము చేయడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మున్సిపల్‌ చైర్మన్‌ పండిత్‌ వినిత పవన్‌ విచ్చేసి మాట్లాడుతూ భారతదేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తొల‌గిపోవాల‌ని ఈయొక్క మహమ్మారి నుండి ప్రజల‌కు విముక్తి కల‌గాల‌ని కరోనా బారిన పడిన వారు కోలుకోవాల‌ని యజ్ఞహోమం నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్‌ఎస్‌కె సమాజ్‌ ...

Read More »

కొనసాగుతున్న జ్వర సర్వే

బోధన్‌, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం శాసనసభ్యులు ఎండీ. షకీల్‌ ఆమ్మేర్‌ ఆదేశాల‌ మేరకు బోధన్‌ మండలం కుమ్మన్‌ పల్లి, కొప్పర్తి క్యాంపు గ్రామంలో ఇంటింటి జ్వరం సర్వే జరుగుతున్న తీరును ఎన్‌డిసిసిబి బ్యాంక్‌ డైరెక్టర్‌ గిర్దవర్‌ గంగారెడ్డి, మాజీ రైసస మండల్‌ కోఆర్డినేటర్‌ బుద్దె రాజేశ్వర్‌లు పరిశీలించారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో చేయంటువంటి విధముగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఏఎన్‌ఎం, అంగన్వాడీ టీచర్‌, ఆశవర్కర్‌ గ్రామ కార్యదర్శితో టీం లు ఏర్పాటు చేసి ...

Read More »

ల‌క్షణాలు ఉన్న వారు మందుల‌ కిట్‌ తీసుకోవాలి

నిజామాబాద్‌, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ వైరస్‌ పై ఇంటింటి సర్వేలో భాగంగా వైద్య సిబ్బంది వచ్చినప్పుడు వారి ఆరోగ్య వివరాలు తెలియజేసి ల‌క్షణాలు ఉన్నట్లయితే మందుల‌ కిట్లు తీసుకొని వాటిని వాడుకోవాల‌ని తద్వారా వైరస్‌ నుండి బయటపడాల‌ని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి కోరారు. బుధవారం కలెక్టర్‌, నగర మేయర్‌ నీతూ కిరణ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌ వి పాటిల్‌తో కలిసి 35, 36 డివిజన్ల పరిధిలోని నాందేవ్‌వాడలో పర్యటించారు. ఇంటింటి సర్వే కొనసాగుతున్న తీరును పరిశీలించారు. ...

Read More »

భగీరథకు ఘన నివాళి

నిజామాబాద్‌, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వైశాఖ శుద్ధ సప్తమి రోజున భగీరథ జయంతి సందర్భంగా జిల్లా యంత్రాంగం ఆయనకు ఘనంగా నివాళులు అర్పించింది. బుధవారం కలెక్టరేట్లోని ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో భగీరథ జయంతి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లా యంత్రాంగం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కోవిడ్‌ ప్రోటో కాల్‌ తో నిర్వహించారు. A solid tribute to Bhagiratha భగీరథ చిత్రపటానికి కలెక్టర్‌ నారాయణ రెడ్డి పూల‌మాల‌వేసి జ్యోతి వెలిగించి ఘనంగా నివాళులు అర్పించారు. ...

Read More »

ఆరోగ్యానికి మేలు చేసే ఆకుకూరలు

నిజామాబాద్‌, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పొన్నగంటి కూర: కంటి చూపును మెరుగుపరిచి, శరీరానికి చలువనిస్తుంది. ముల్లంగి: సర్వరోగ నివారిణిగా పనిచేస్తుంది. చింత చిగురు: రక్తాన్ని శుద్ధి చేసి కాలేయానికి పుష్టినిస్తుంది. చామకూర: కిడ్నీ, మూల‌వ్యాధుల‌ను అరికడుతుంది. పుదీన: గ్యాస్‌ సమస్యను నివారిస్తుంది. పాల‌కూర: కంటి సమస్యలు పోతాయి. తోటకూర: రక్తం పెరుగుదల‌కు ఉపయోగపడుతుంది. మెంతికూర: మూత్రాశయంలోని రాళ్లు కరిగిపోతాయి.

Read More »