Breaking News

అంగరంగ వైభవంగా ల‌క్ష్మినారాయణ స్వామికళ్యాణ మహోత్సవం

ఆర్మూర్‌, మే 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ పట్టణం శ్రీ దత్తాత్రేయ ల‌క్ష్మినారాయణ స్వామి ఆయంలో ఎస్‌ఎస్‌కె సమాజ్‌ ఆధ్వర్యంలో బుధవారం ల‌క్ష్మినారాయణ స్వామి కళ్యాణము చేయడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మున్సిపల్‌ చైర్మన్‌ పండిత్‌ వినిత పవన్‌ విచ్చేసి మాట్లాడుతూ భారతదేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తొల‌గిపోవాల‌ని ఈయొక్క మహమ్మారి నుండి ప్రజల‌కు విముక్తి కల‌గాల‌ని కరోనా బారిన పడిన వారు కోలుకోవాల‌ని యజ్ఞహోమం నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కార్యక్రమంలో ఎస్‌ఎస్‌కె సమాజ్‌ అధ్యక్షుడు పడల్‌ గణేష్‌, కార్యదర్శి బరాడ్‌ గంగమోహన్‌, గటడి కిషన్‌, పూజారులు సత్యం, సంతోష్‌, ఎస్‌ఎస్‌కె సమాజ్‌ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఎస్‌ఆర్‌ఎస్‌పిలో ఆరుగురు గ‌ల్లంతు

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం పోచంపాడ్‌ విఐపి పుష్కర ఘాట్‌ వద్ద గుత్ప ...

Comment on the article