Breaking News

నళినికి డాక్టరేట్‌ ప్రదానం

డిచ్‌పల్లి, మే 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాల‌యంలోని బిజినెస్‌ మేనేజ్‌ మెంట్‌ విభాగపు పరిశోధకులు జి. నళినికి పిహెచ్‌. డి. డాక్టరేట్‌ పట్టా ప్రదానం చేయబడింది. బిజినెస్‌ మేనేజ్‌ మెంట్‌ విభాగంలో ప్రొఫెసర్‌ కైసర్‌ మహ్మద్‌ పర్యవేక్షణలో పరిశోధక విద్యార్థి జి. నళిని ‘‘ది పాటర్న్‌ ఆఫ్‌ ఎంప్లాయీ ఎంగేజ్‌ మెంట్‌ ఇన్‌ ప్రైవేట్‌ సెక్టార్‌ బ్యాంక్స్‌ – ఎ సెలెక్ట్‌ స్టడీ’’ అనే అంశంపై పరిశోధన చేసి సిద్ధాంత గ్రంథం రూపొందించారు.

ఓపెన్‌ వైవా వోస్‌ (వర్చువల్‌) కు ఎక్స్‌ టర్నల్‌ ఎగ్జామినర్‌ విచ్చేసి పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. వైవా వోస్‌కు కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌ మెంట్‌ డీన్‌ ఆచార్య ఎం. యాదగిరి చైర్మన్‌గా, బిఓఎస్‌ డా. వాణి కన్వీనర్‌గా వ్యవహరించారు.

విభాగాధిపతి డా. రాజేశ్వరి, అధ్యాపకులు డా. అపర్ణ, డా. ఆంజనేయులు, తదితర అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు. జి. నళిని పిహెచ్‌. డి. సాధించడం పట్ల ఉపకుల‌పతి నీతూ కుమారి ప్రసాద్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం, ప్రిన్సిపల్‌ డా. వాసం చంద్రశేఖర్‌, కంట్రోల‌ర్‌ డా. పాత నాగరాజు, పి ఆర్‌ ఓ డా. వంగరి త్రివేణి, తదితర అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు శుభాభినందనలు తెలిపారు.

Check Also

ఘనంగా ఎన్‌.ఎస్‌.యూ.ఐ ఆవిర్భావ వేడుకలు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం నిజామాబాద్‌ నగరం కాంగ్రెస్‌ భవన్‌లో ఎన్‌.ఎస్‌. యూ.ఐ ...

Comment on the article