Breaking News

కొనసాగుతున్న జ్వర సర్వే

బోధన్‌, మే 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం శాసనసభ్యులు ఎండీ. షకీల్‌ ఆమ్మేర్‌ ఆదేశాల‌ మేరకు బోధన్‌ మండలం కుమ్మన్‌ పల్లి, కొప్పర్తి క్యాంపు గ్రామంలో ఇంటింటి జ్వరం సర్వే జరుగుతున్న తీరును ఎన్‌డిసిసిబి బ్యాంక్‌ డైరెక్టర్‌ గిర్దవర్‌ గంగారెడ్డి, మాజీ రైసస మండల్‌ కోఆర్డినేటర్‌ బుద్దె రాజేశ్వర్‌లు పరిశీలించారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో చేయంటువంటి విధముగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఏఎన్‌ఎం, అంగన్వాడీ టీచర్‌, ఆశవర్కర్‌ గ్రామ కార్యదర్శితో టీం లు ఏర్పాటు చేసి ఇంటింటి సర్వే చేస్తూ కోవిడ్‌ -19 ల‌క్షణాలున్న వారికి మందుల‌ కిట్‌ అందచేయడం జరుగుతుందన్నారు.

ల‌క్షణాలు ఉన్న వారికి అక్కడే థర్మామీటర్‌తో జ్వరం, పల్స్‌ ఆక్సిమిటర్‌తో ఆక్సిజన్‌ లెవెల్స్‌ చూడడం జరుగుతుందని తెలిపారు. కోవిడ్ ల‌క్షణాలు జ్వరం, గొంతు నొప్పి, ఒళ్ళు నొప్పులు, తల‌నొప్పి ఇతరాత్ర ల‌క్షణాలు ఉంటే అంటిజెన్‌ టెస్ట్‌ పిఎచ్‌సిలో చేసుకొని పాజిటివ్‌ ఉంటే మందులు వాడితే కోవిడ్‌ తగ్గి పోతుందని అన్నారు. సర్వే చేసి ల‌క్షణాలు గుర్తించి ముందుగానే మందులు ఇవ్వడం ద్వారా గత రెండు రోజుల‌ నుండి పాజిటివ్‌ కేసులు తగ్గు ముఖం పడుతున్నాయన్నారు.

ప్రతి ఒక్కరు మాస్క్‌ు పెట్టు కోవాల‌ని, భౌతిక దూరం పాటించాల‌ని, చేతులు శుభ్రంగా ఎప్పటికప్పుడు కడుక్కోవాల‌ని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు కోర్వ గంగాధర్‌, బోల్లేపల్లి సుశీల‌, ఎంపీటీసీలు ప్రభాకర్‌, వెంకట్రావు, ఏఎన్‌ఎంలు, సుశీల‌, అంగన్వాడీ టీచర్ లు ఆశా వర్కర్స్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

ప్రజాస్వామ్యం ప్రమాదంలోకి నెట్ట బడుతుంది

బోధన్‌, మార్చ్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీజేపీ పాల‌నలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని ఐఎఫ్‌టీయూ జిల్లా ...

Comment on the article