Breaking News

అంతరాష్ట్ర కార్మికుల‌ వివరాలు అందజేయాలి…

నిజామాబాద్‌, మే 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల‌కు చెందిన కార్మికులు ఇతర రాష్ట్రాల‌లో పనిచేసి వారి స్వంత గ్రామాల‌కు తిరిగి వస్తే వారి దగ్గరలో ఉన్న, వారి పరిధిలో ఉన్న సహాయ కార్మిక అధికారుల‌కు వారి పూర్తి వివరాలు అందజేయాల‌ని ఉప కార్మిక కమీషనర్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పేరు, తండ్రిపేరు, వయస్సు, లింగము, ఆధార్‌కార్డు, రేషన్‌ కార్డు, మోబైల్‌ నెంబర్‌, గతంలో పనిచేసిన ప్రదేశం తదితర వివరాలు అందజేయాల‌న్నారు.

అలాగే రెండు జిల్లాల్లోని ఇటుక‌ బట్టీల‌ యజమానుల‌కు, రైస్‌మిల్‌ యజమానుల‌కు, నిర్మాణ సంస్థల‌ యజమానుల‌కు, నిర్మాణ పనుల‌ కాంట్రాక్టర్లకు పలు సూచనలు చేశారు. వారి వద్ద పనిచేసి వెళ్ళిన అంతరాష్ట్ర కార్మికుల‌ పూర్తి వివరాలు వారి దగ్గరలో ఉన్న సహాయ కార్మిక అధికారుల‌కు తెలియజేయాల్సిందిగా కోరారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article