Breaking News

దరఖాస్తుల‌ ఆహ్వానం

నిజామాబాద్‌, మే 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ నిజామాబాద్‌లో గల‌ రాష్ట్రీయ బాల‌ స్వాస్థ్య కార్యక్రమంలోని సైకాల‌జిస్టు పోస్టుకు, మరియు జిల్లా టీకా అధికారి కార్యాల‌యంలో ఇమ్యునైజేషన్‌ విభాగంలో గ రిఫ్రిజిరేషన్‌ టెక్నిషియన్‌ పోస్టుకు అర్హులైన అభ్యర్థుల‌ నుండి దరఖాస్తులు కోరుతున్నట్టు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బాల‌ నరేంద్ర ఒక ప్రకటనలో తెలిపారు.

అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తుల‌ను జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి కార్యాల‌యం నుండి తీసుకోవాల‌ని, పూర్తి చేసిన దరఖాస్తుల‌ను అర్హత దృవపత్రాలు జతచేసి ఈనెల‌ 24 సోమవారం సాయంత్రం 5 గంటల‌లోపు అందజేయాల‌న్నారు.

Check Also

రాజ్యసభ సభ్యులు సురేశ్‌రెడ్డి మొక్కలు నాటారు…

హైదరాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తన పుట్టినరోజు సందర్భంగా గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ...

Comment on the article