Breaking News

గోదావరి తీరాన వల‌స పక్షుల‌ సందడి

నందిపేట్‌, మే 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా నందిపేట్‌ మండలం గోదావరి తీరం వల‌స పక్షుల‌తో కల కల‌లాడుతుంది. ప్రతి సంవత్సరం వేసవిలో వాటి రాకతో ఆ ప్రాతంలో పక్షుల‌తో సందడి ఉంటుంది. నందిపెట్‌ మండల‌ జీజీ నడుకుడా గ్రామ శివారులో గోదావరి పరివాహక ప్రాతంలో ఆఫ్రికన్‌కి చెందిన ఫ్లెమింగోస్‌, మెక్సికో కి చెందిన ఫెలికన్స్‌ పక్షులు వల‌స వచ్చాయి. ప్రతి సంవత్సరం వేసవిలో పక్షుల వల‌స వచ్చి వెళ్లడం జరుగుతుందని నందిపేట అటవీశాఖ డిప్యూటీ రేంజ్‌ అధికారి సుధాకర్‌ తెలిపారు.

అయితే ఇవి రాత్రిపూట మాత్రమే గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయని ఆయన తెలిపారు. గత సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెల‌లో జింకలు సందడి చేసాయి. వాటిని చూడడానికి జిల్లా పాల‌నాధికారి నారాయణ, సిపి కార్తికేయ గోదావరి తీరాన్ని సందర్శించి ఇట్టి ప్రదేశాన్ని పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేస్తామని ప్రణాళికలు చేశారు. ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్ర పర్యటక శాఖ అధికారిని శోభ హైదరాబాద్‌ నుండి ఏప్రిల్ నెల‌లో వచ్చి గోదావరి తీరాన్ని పర్యటించి ఇట్టి ప్రదేశాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చి వెళ్లారు.

కరోన కేసులు తగ్గుముఖం పట్టిన తర్వాత పర్యాటక కేంద్రంగా అవుతుందని మండల‌ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడున్న లాక్డౌన్‌, కరోన కారణంగా పర్యాటకుల‌కు అనుమతి లేదని వీటి రక్షణ కోసం ప్రతి రోజు పెట్రోలింగ్‌ చేస్తున్నట్లు నందిపేట అటవీశాఖ డిప్యూటీ రేంజ్‌ అధికారి సుధాకర్‌ పేర్కొన్నారు.

Check Also

సిఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కు పంపిణీ

నందిపేట్‌, జూలై 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలం తొండకూరు గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిధి సీఎంఆర్‌ఎఫ్‌ ...

Comment on the article