Breaking News

బెడ్లు, ఆక్సీజన్‌ కొరత లేకుండా చూడాలి

బోధన్‌, మే 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాల‌యంలో నియోజకవర్గ వైద్యారోగ్య అధికారుల‌తో కరోనా పరిస్థితుల‌పై ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని ఎమ్మెల్యే షకీల్‌ నిర్వహించారు. ప్రజల‌కు కరోనా సౌకర్యాలు గ్రామస్థాయిలో కూడా కల్పించాల‌ని ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాల‌ని మెడికల్‌ ఆఫీసర్లకు సూచించారు. ప్రభుత్వ హాస్పిటల్లో కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యల‌ గురించి ఆరా తీశారు.

కరోనా రోగుల‌కు బెడ్లు మరియు ఆక్సిజన్‌ కొరతలేకుండా చూడాల‌న్నారు. బ్లాక్‌ ఫంగస్‌తో ప్రజల‌కు ఇబ్బందులు రానివ్వద్దని డాక్టర్లకు సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కరోనా సెకండ్‌ వేవ్‌ ఇంటింటి సర్వేను అధికారులు, సిబ్బంది పకడ్బందీగా నిర్వహించాల‌ని ప్రజాప్రతినిధులు పాల్గొని సహకరించాల‌న్నారు. లాక్‌ డౌన్‌కు ప్రజలు, వ్యాపారులు 10 గంటల‌కు బందుచేసి కరోనను తరిమికొట్టాల‌ని తెలిపారు.

జిల్లా మంత్రి, కలెక్టర్లు ఎప్పటికప్పుడు రివ్యూ మీటింగ్‌లు పెట్టి ప్రజల‌ను అల‌ర్ట్‌ చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో రాజేశ్వర్‌, కమిషనర్‌ రామలింగం, బోధన్‌ పట్టణ సిఐ రామన్‌, ఎంపీపీ బుద్ధ సావిత్రి రాజేశ్వర్‌ మెడికల్‌ ఆఫీసర్స్‌ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Check Also

ప్రజాస్వామ్యం ప్రమాదంలోకి నెట్ట బడుతుంది

బోధన్‌, మార్చ్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీజేపీ పాల‌నలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని ఐఎఫ్‌టీయూ జిల్లా ...

Comment on the article