Breaking News

నందిపేట్‌లో భారీగా తగ్గిన కరోనా కేసులు

నందిపేట్‌, మే 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గ్రామాల‌లో గడిచిన 24 గంటల‌ వ్యవధిలో నిర్వహించిన కరోన టెస్ట్‌లో శనివారం ఒక్క పాజిటివ్‌ కేసు నమోదు కాకపోవడంతో అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 33 మందికి టెస్ట్‌లు చేయగా ఎవరికి ఏమి సమస్య రాకుండ జీరో అయింది. డొంకేశ్వర్‌ ఆసుపత్రి పరిధిలో 18 మందికి టెస్టులు చేయగా ఒకే ఒక్క కేసు నమోదు అయింది. అక్కడ కూడ త్వరలో జీరోకు చేరుకొంటామని డాక్టర్‌ గంగ రెడ్డి ఆశభావం వ్యక్తం చేశారు.

రెండవ విడత కరోన మార్చి నెల‌లో ఒక్కసారి విజృభించడంతో భారీగా కేసులు నమోదు కావడంతో పాటు మరణాలు కూడ సంభవించాయి. మండలంలోని డొంకేశ్వర్‌, నందిపేట్‌ ఆసుపత్రి పరిధిలో ప్రతి రోజు సెంచరికి చేరువలో కేసులు నమోదు అయ్యాయి. కొన్ని సార్లు సెంచరీ కూడా దాటాయి. ప్రముఖ వ్యాపారస్తులు, సీనియర్‌ జర్నలిస్ట్‌లు కరోన కాటుకు బలి అయ్యారు. దింతో స్పందించిన వైద్య సిబ్బంది, అధికారులు, ప్రజా ప్రతినిధులు, సమయ స్ఫూర్తితో నిర్ణయాలు తీసుకొని స్వచ్చంద లాక్‌డౌన్‌ ప్రకటించారు. అప్పటి నుండి కొద్ది కొద్దిగా కేసులు తగ్గుతూ వచ్చాయి.

మే 12 నుంచి తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ ప్రకటించడంతో ప్రజలు ఇండ్లలోనే వుంటున్నారు. దాంతో కేసుల‌ సంఖ్య తగ్గి రోజుకు రెండు, మూడుకు వచ్చాయి. నందిపేట్‌ వైద్య అధికారి అజయ్‌ కుమార్‌ శనివారం తెలిపిన వివరాల‌ ప్రకారం రెండవ విడత ప్రారంభ దశ నుండి ఇప్పటి 670 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 55 మంది హోమ్‌ ఐసోలేషన్‌లో వున్నారు. అదే విధంగా డొంకేశ్వర్‌ వైద్య అధికారి గంగ రెడ్డి తెలిపిన వివరాల‌ ప్రకారం 413 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 86 మంది హోమ్‌ ఐసోలేషన్‌లో వుండి చికిత్స పొందుతున్నారు.

మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కరోనా కేసులు తగ్గుతున్నాయి. అలాగే మరణాల‌ సంఖ్య కూడా తగ్గింది. కరోన కేసులు తగ్గడం చాలా సంతోష కర విషయం అయినప్పటికీ ప్రజలు ఇలాగే సహకరించాలి, అనవసరంగా ఇంటి నుండి బయటకు రావద్దు. ఎలాంటి ల‌క్షణాలు కనిపించిన త్వరగా వచ్చి టెస్ట్‌ చేయించుకోండి. ధైర్యంగా ఉండి, ప్రారంభ దశలో వైద్యం తీసుకొంటే కరోన తగ్గుతది. ప్రజలు ఇలాగే సహకరిస్తే మండలాన్ని కరోన రహిత మండలం గా చేయవచ్చు. తమ సిబ్బంది 24 గంటల‌ శ్రమ ఫలిస్తుందని వైద్యాధికారి పేర్కొన్నారు.

Check Also

సిఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కు పంపిణీ

నందిపేట్‌, జూలై 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలం తొండకూరు గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిధి సీఎంఆర్‌ఎఫ్‌ ...

Comment on the article