Breaking News

హెల్త్‌ సెంటర్‌ సిబ్బందికి పండ్లు పంపిణీ చేసిన మేయర్‌

నిజామాబాద్‌, మే 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ చంద్రశేఖర్ కాల‌నీ, అర్సపల్లి, మాల‌పల్లి, ఇంద్రపూర్‌లో విధులు నిర్వహిస్తున్న ఆశా కార్యకర్తలు, నర్సులు, స్టాఫ్‌ నర్సు, ఫార్మాసిస్ట్లు, ఇతర సిబ్బందికి నగర మేయర్‌ నీతూ కిరణ్‌ పండ్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ గత సంవత్సర కాలం నుంచి కరోనా వ్యాధి విజ ృంభిస్తున్న, లాక్‌ డౌన్‌ పరిస్థితుల్లో ప్రజలందరు ఇళ్లకే పరిమితమైన, వైరస్‌ బారినపడే ప్రమాదం ఉన్న ఎక్కడ భయపడకుండా ఇంటికి తిరుగుతూ కరోనా వ్యాధి సోకిన వారికి మందుల‌ను అందిస్తూ వారి ఆరోగ్య పరిస్థితుల‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తు వ్యాధి గ్రస్తుల‌కు ధైర్యాన్ని ఇవ్వటమే కాకుండా రోగుల‌కు చికిత్స అందించే క్రమంలో ఎంతో మంది ఆరోగ్య సిబ్బంది ఆశా కార్యకర్తలు, నర్సులు, డాక్టర్లు విధి నిర్వహణలో ప్రాణాల‌ను కోల్పోయిన ప్రజల‌కు సేవల‌ను అందిస్తున్నారని వారి క ృషికి ఎంత చేసిన తక్కువేనని వారి సేవల‌ను కొనియాడారు.

నిత్యం ప్రజల‌తో ప్రజల‌ ఆరోగ్యాన్ని పరిరక్షించే క్రమంలో ఆశా కార్యకర్తలు, నర్సులు, అర్బన్‌ హెల్త్‌ సిబ్బందికి తన వంతుసహాయంగా వారి ఆరోగ్యంగా ఉండాల‌ని తన సొంత డబ్బుతో నాలుగు అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ పరిధిలోని సుమారు 150 మంది సిబ్బందికి పండ్లు పంపిణీ చేయటం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో హెల్త్‌ సెంటర్ల వైద్యులు, ఇంద్రపూర్‌ కార్పొరేటర్‌ సాయి వర్ధన్‌, స్టాఫ్‌ నర్సు, ఎయన్‌ఎం, ఆశా కార్యకర్తలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article