Breaking News

రద్దీని తగ్గించడానికి మరిన్ని చర్యలు

నిజామాబాద్‌, మే 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లాక్‌ డౌన్‌ సడలింపు సమయంలో ప్రజల‌ రద్దీని తగ్గించడానికి మరిన్ని చర్యలు చేపట్టాల‌ని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. శనివారం తన చాంబర్లో పోలీస్‌ కమీషనర్‌ కార్తికేయ, మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌ అదనపు కలెక్టర్‌ చంద్ర శేఖర్‌తో కల‌సి లాక్‌ డౌన్‌ను కఠినంగా అమలు చేయటకు తీసుకోవాల్సిన చర్యల‌పై చర్చించారు.

జిల్లాలో ఇప్పుడిప్పుడే వైరస్‌ తగ్గు ముఖం పడుతున్నదని కావున ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాల‌ని రద్దీ అధికంగా ఉన్న ప్రాంతాల్లో కఠినంగా అమలు చేయాల‌ని, అదేవిధంగా కూరగాయలు అమ్ముతున్న ప్రాంతాలో రద్దీని తగ్గించడానికి మరిన్ని తాత్కాలిక మార్కెట్లు ఏర్పాటు చేయాల‌ని మున్సిపల్‌ కమీషనర్‌, మార్కెటింగ్‌ శాఖ అధికారిని ఆదేశించారు. గోదాం రోడ్డు , వీక్లీ మార్కెట్‌లో కూర్చొని అమ్ముతున్న కూరగాయల‌ వ్యాపారులు రైతు బజార్‌లో అమ్ముకునే విధముగా చర్యలు తీసుకోవాల‌ని తెలిపారు. వారు సుభాష్‌ నగర్‌, ఫులాంగ్‌ రైతు బజార్‌లో లేదా ఐటిఐ ప్రాంతములో అమ్ముకోనే విధముగా చర్యలు తీసుకోవాల‌ని మున్సిపల్‌ కమీషనర్‌కు ఆదేశించారు.

అదేవిధంగా మార్కెట్‌ కమిటీ ద్వారా మొబైల్‌ రైతు బజార్‌ ఏర్పాటు చేయాల‌ని మార్కెట్‌ కమిటీ ఏడిని ఆదేశించారు. జిల్లాలో నాన్‌ వెజ్‌ మటన్‌, ఫిష్‌ మార్కెట్‌ దగ్గర సోషల్‌ డిస్టెన్స్‌ పాటించే విధముగా చర్యలు తీసుకోవాల‌ని అతిక్రమిస్తే చర్యలు తీసుకోవాల‌న్నారు. రద్దీ అధికంగా ఉన్న ప్రాంతంలో బారికేడ్లు పెట్టాల‌ని అన్ని రేపటి నుండి అమలు జరగాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. సమావేశములో నిజామాబాద్‌ మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌ కుమార్‌, అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రశేఖర్‌, నిజామాబాదు ఆర్‌డిఓ రవి కుమార్‌, మార్కెట్‌ కమిటీ ఏడి తదితరులు పాల్గొన్నారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article