Breaking News

ఆసుపత్రుల‌లో పారిశుద్ధ్యం, హరితహారం కార్యక్రమాలు ప్రత్యేకంగా నిర్వహించాలి

నిజామాబాద్‌, మే 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లాక్‌ డౌన్‌ కఠినంగా అమలు చేయాల‌ని రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా క్లారిటీ ఇచ్చారని దానితోపాటు ఆసుపత్రుల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు ఖచ్చితంగా నిర్వహించాల‌ని, లేబర్‌ టర్న్‌ అవుట్‌ పెంచుకోవడంతో పాటు నర్సరీలో మొక్కల‌ను కాపాడాల‌ని హరిత హారంలో నాటిన మొక్కల‌ను బతికించడానికి ప్రతిరోజు నీటిని అందించాల‌ని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి మండల‌ స్థాయి గ్రామస్థాయి అదేవిధంగా మండల‌ ప్రత్యేక అధికారుల‌ను ఆదేశించారు. శనివారం వీడియో కాన్ఫరెన్సులో లాక్‌ డౌన్‌ను కఠినంగా అమలు చేయటకు రద్దీని తగ్గించడానికి చర్యలు తీసుకోవాల‌ని ఆదేశించారు.

జిల్లాలో వైరస్‌ ఒక్కపుడు 32 శాతం ఉన్నదని ఇప్పుడు 10 శాతం వరకు వచ్చినదని ఇందుకు రాష్ట్ర, జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యల‌ ఫలితమే అన్నారు. గతంలో 2200 బెడ్స్‌ నిండిపోయినాయని కానీ ఇప్పుడు 638 మాత్రమే పేషెంట్లు ఉన్నారన్నారు. ఉదయం 6 నుండి 10 గంటల‌ వరకు నార్మల్‌ టైం అదేవిధంగా కూరగాయలు అమ్ముతున్న ప్రాంతాల‌లో, టిఫిన్‌ సెంటర్‌లో గుంపులు గుంపులుగా వస్తున్నారు ఎక్కడా కోవిడ్‌ నిబంధనలు పాటించడము లేదు, ఆ ప్రాంతంలో అధికారులు చాలా అలెర్ట్‌గా ఉండాల‌న్నారు. గ్రామములో కానీ మండలంలో, నేల‌ పైన కూర్చొని అమ్మే వారిని గ్రౌండ్‌కు తరలించాల‌ని, రద్దీ అధికంగా ఉన్న దగ్గర సంతలు పెట్టరాదన్నారు.

అదేవిధంగా మార్కెట్‌ కమిటీ ద్వారా మొబైల్‌ రైతు బజార్‌ ఏర్పాటు చేసుకోవాల‌ని ఆదేశించారు. జిల్లాలో కానీ మండలంలోని ఎక్కడైనా నాన్‌ వెజ్‌ మటన్‌, ఫిష్‌ మార్కెట్‌ దగ్గర సోషల్‌ డిస్టెన్స్‌ పాటించే విధంగా చర్యలు తీసుకోవాల‌ని అతిక్రమిస్తే చర్యలు తీసుకోవాల‌న్నారు. రద్దీ అధికంగా ఉన్న ప్రాంతంలో బారికేడ్లు పెట్టాల‌ని అన్ని రేపటి నుండి అమలు జరగాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ప్రతి ఒక్కరు మాస్కు, సోషల్‌ డిస్టెన్స్‌, శానిటేషన్‌ చేయించాల‌న్నారు. 10 తర్వాత ఒక్కరు రోడ్డు పైన ఉండరాదని, ఒక్క అంబులెన్స్‌ మాత్రమే కనబడాల‌న్నారు.

ప్రతి ఒక్కరు రేపు 6 నుండి 10 గంటల‌ వరకు ఫిల్డ్‌లో ఉండాల‌ని, ఎక్కడా కూడా గుంపులు గుంపులుగా కనబడరాదన్నారు. ప్రతి పీహెచ్‌సి, సియస్‌సిలో శానిటేషన్‌ చేస్తూ, ఆసుపత్రి బిల్డింగ్‌లు చాలా శుభ్రంగా ఉండేవిధంగా, టాయిలెట్స్‌ వర్కింగ్‌ కండిషన్‌లో ఉండేవిధంగా చర్యలు తీసుకోవాల‌ని, అదేవిధంగా మంచినీరు ప్రాపర్‌ వుండే విధంగా చర్యలు తీసుకోవాల‌న్నారు. చుట్టూ ప్రక్కల‌ మంచి మొక్కలు పెట్టాల‌ని, ప్రతి ఆసుపత్రిలో డస్ట్‌ బిన్‌లు ఏర్పాటు చేయాల‌ని అధికారుల‌కు ఆదేశించారు. డోర్‌ టు డోర్‌ సర్వే మొదటి రౌండ్‌ పూర్తి అయినది, అదేవిధంగా రెండవ రౌండ్‌ పూర్తి కావాల‌ని, మొదటి, రెండవ రౌండ్‌లో వచ్చిన కేసులు ఎప్పటికప్పుడు తనిఖీ చేయాల‌న్నారు.

కోవిడ్‌ తగ్గిన వారిని వదిలి ఇంకా తగ్గని వారిని ప్రతి రోజు మానిటర్‌ చేయాల‌ని, మనకు ఒక్కప్పుడు ఆక్సిజన్‌ చాలా వాడినము కానీ ఇప్పుడు 50 శాతం తగ్గింది, కావున మనం గట్టిగా పనిచేస్తే 0 శాతంకు వస్తామన్నారు. అదేవిధంగా డోర్‌ టు డోర్‌ సర్వేలో ప్రజా ప్రతినిధుల‌ను కలుపుకొని పోవాల‌ని, అధికారుల‌ను ఆదేశించారు. నర్సరీలు జూన్‌ చివరి వరకు పూర్తి కావాల‌ని, నర్సరీలో పెద్ద మొక్కలు పెట్టాల‌ని గతంలో చెప్పుడమైనది కొన్ని మండలంలోని చాలా వరకు పెద్ద మొక్కలు రాలేదు కావున పెద్ద మొక్కల‌పై ద ృష్టి పెట్టాల‌న్నారు.

పెట్టిన మొక్కలు ఎండి పోవద్దని, ప్రతి రోజు వాటర్‌ చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అదేవిధంగా లేబర్‌ టర్నవుట్‌ చాలా తక్కువగా ఉన్నది కావున 200 తగ్గకుండా చూడాల‌ని సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. సమావేశములో అడిషనల్‌ కలెక్టర్ ల‌త, గోవింద్‌ నాయక్‌, చందర్‌, డిఆర్‌డిఓ పిడి , నరేందర్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article