Breaking News

జగిత్యాల‌లో 158 వాహనాలు సీజ్‌

జగిత్యాల్‌, మే 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :  జగిత్యాల‌ జిల్లాలో లాక్‌ డౌన్‌ పకడ్బందీగా అమల‌వుతుందని, అందుకు ప్రజలందరూ సహకరిస్తున్నారని జిల్లా ఎస్పీ సింధు శర్మ ఐపీఎస్‌  అన్నారు. ఆదివారం జగిత్యాల‌ పట్టణంలో లాక్‌ డౌన్ అమలు తీరును పర్యవేక్షించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పకడ్బందీగా పోలీస్‌ బందోబస్తుతో లాక్‌ డౌన్‌ కఠినంగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 

అందుకు ప్రజలందరూ సహకరిస్తున్నారన్నారు. కొంతమంది అనవసరంగా బయట తిరిగే వారిని, కారణం లేకుండా బయటికి వచ్చే వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని ఇప్పటి వరకు 158 వాహనాల‌ను సీజ్‌ చేయడంతో పాటు జరిమానాలు విధించడం జరుగుతుందని చెప్పారు. 

కరోనా కట్టడి కోసం పోలీస్‌ శాఖ మరింత కఠిన చర్యలు చేపడుతూ కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం క ృషి చేస్తున్నదని అన్నారు. జిల్లా ఎస్పీ వెంట డీఎస్పీలు వెంకటరమణ, ప్రతాప్‌, టౌన్‌ ఇన్స్‌పెక్టర్‌ జయేష్‌ రెడ్డి, రిజర్వ్‌ ఇన్స్‌పెక్టర్‌ నవీన్‌ ఉన్నారు.

 

Check Also

జగిత్యాల నుంచే తెరాస జైత్రయాత్ర

ఎంపి కవిత జగిత్యాల, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జగిత్యాల నుంచే టిఆర్‌ఎస్‌ జైత్రయాత్ర మొదలవుతుందని ...

Comment on the article