Breaking News

మొబైల్‌ కూరగాయల‌ వాహనాలు ప్రారంభం

నిజామాబాద్‌, మే 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొనసాగుతున్న లాక్‌ డౌన్‌ ను ద ృష్టిలో పెట్టుకొని నగర ప్రజల‌కు ఇంటి వద్దకే కూరగాయలు అందించడానికి 13 మొబైల్‌ కూరగాయల‌ వాహనాల‌ను ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

ఆదివారం నుండి వాహనాలు నగరంలోని గంగాస్థాన్‌, వినాయక నగర్‌, మాధవ నగర్‌, కాలూరు, గుండారం, ముబారక్‌ నగర్‌, అశోక్‌ నగర్‌, సుభాష్‌ నగర్‌, బోర్గాం తదితర ప్రాంతాల్లో ప్రజల‌కు కావల‌సిన వివిధ రకాల‌ కూరగాయల‌తో తిరుగుతాయని తెలిపారు. లాక్‌ డౌన్‌ సడలింపు సమయంలో కూరగాయల‌ కొరకు ప్రజలు రద్దీగా ఉండే ప్రాంతాల్లో పర్యటించి ఇబ్బందులు తెచ్చుకోకూడదని ఉద్దేశంతో వాహనాల‌ను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.

ప్రజలు తమ ఇంటి ముందుకు వచ్చే కూరగాయల‌ను తీసుకోవాల‌ని, బయటకు వెళ్లి కరోనా ప్రమాదం బారిన పడవద్దని ఆయన తెలిపారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల‌ని కోరారు. ఆదివారం జిల్లా మార్కెటింగ్‌ అధికారి గంగు, కార్యదర్శి విజయ్‌ కిషోర్‌ తదితరులు వాహనాల‌ను ప్రారంభించారని తెలిపారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article