Breaking News

పరిశోధనా రంగంలో యూనివర్సిటీని మొదటి స్థానంలో నిలుపుతా

డిచ్‌పల్లి, మే 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మన తెలంగాణ రాష్ట్రంలో పరిశోధనా రంగంలోనే తెలంగాణ యూనివర్సిటీని మొదటి స్థానంలో నిలుపుతానని నూతన ఉపకుల‌పతి ఆచార్య డి. రవీందర్ వెల్ల‌డిరచారు. సోమవారం ఉదయం తెలంగాణ విశ్వవిద్యాల‌యానికి ఉపకుల‌పతి ఆచార్య డి. రవీందర్‌ విచ్చేశారు. వారికి రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం పుష్పగుచ్చంతో స్వాగతం పలికి వీసీ చాంబర్‌లోకి ఆహ్వానించారు. తన వీసీ ఆస్థానంలో కూర్చున్న ఆచార్య డి. రవీందర్ తెలంగాణ విశ్వవిద్యాల‌య ఉపకుల‌పతి బాధ్యతలు స్వీకరించారు. దీనికి సంబంధించి రిజిస్ట్రార్‌ ఉపకుల‌పతి బాధ్యత స్వీకరణ పత్రం మీద ఆచార్య డి. రవీందర్‌తో సంతకం తీసుకున్నారు.

ఈ సందర్భంగా రిజిస్ట్రార్‌ మాట్లాడుతూ అత్యుత్తమ శాస్త్ర సాంకేతిక రంగంలో అద్భుతమైన అనుభవం కలిగిన ఆచార్య డి. రవీందర్‌ వీసీగా విశ్వవిద్యాల‌యానికి నియమింప బడడం శుభదాయకమన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేయబడిన ఆత్మీయ స్వాగత సభలో ఉపకుల‌పతి ఆచార్య డి. రవీందర్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పరిశోధనా రంగంలోనే మన తెలంగాణ యూనివర్సిటీని మొదటి స్థానంలో నిలుపుతానని పేర్కొన్నారు. తాను పూర్తిగా పరిశోధనా రంగానికి మాత్రమే పరిమితమైన వ్యక్తినని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో శాస్త్ర సాంకేతిక రంగాల‌లో ప్రాముఖ్యం వహించిన వ్యక్తినని అన్నారు.

తన పరిశోధానానుభవంతో ఉస్మానియా విశ్వవిద్యాల‌యం కంటే అత్యున్నత స్థానానికి తెలంగాణ విశ్వవిద్యాల‌యం చేరే విధంగా చేస్తానని వివరించారు. నియమింపబడిన వీసీలో విస్త ృతమైన పరిశోధనా నేపథ్యం కలిగిన తను ఉపకుల‌పతి పదవితో ఇంకా తన సేవల‌ను అధిగమించి పరిశోధనలో నూతన ఆవిష్కరణలు చేస్తానని అన్నారు. దాదాపుగా 35 సంవత్సరాలు పరిశోధనానుభవం, 30 సంవత్సరాలు బోధనానుభవం ఉందని అన్నారు. ఎం.ఫిల్‌. సాలిడ్‌ స్టేట్‌ ఫిజిక్స్‌, పిహెచ్‌.డి. మెటీరియల్‌ సైన్స్‌ మీద పరిశోధన చేసి డాక్టరేట్‌ సాధించానని అన్నారు. డి.ఎస్‌.టి-జె.ఎస్‌.పి.ఎస్‌. ఇన్విటేషన్‌ ఫెలోషిప్‌, బాయ్స్‌ కాట్‌ ఫెలోషిప్‌, రాయల్‌ సొసైటీ విజిటింగ్‌ ఫెలోషిప్‌, యంగ్‌ సైంటిస్ట్‌ అవార్డ్‌, యుజిసి కెరీర్‌ అవార్డ్‌ తదితర అత్యున్నత పురస్కారాల‌ను పొందానన్నారు.

డి.ఎస్‌.టి., యుజిసి, టిడబ్ల్యూఎఎస్‌ (ఇటలీ) లో ఏడు రీసెర్చ్‌ ప్రాజెక్టు పూర్తిచేశానన్నారు. తన వద్ద 12 మందికి పిహెచ్‌.డి. అవార్డు అయిందని, 8 మంది ప్రస్తుతం పరిశోధన చేస్తున్నట్లుగా వివరించారు. 201 పరిశోధనా పత్రాల‌ను ఇంటర్నేషనల్‌ జర్నల్స్‌లో ప్రచురించానని తెలిపారు. భారతదేశ ప్రథమ పౌరుడు మాజీ రాష్ట్రపతి డా. అబ్దుల్‌ కలాం చేతుల‌ మీదుగా యంగ్‌ సైంటిస్ట్‌ అవార్డు పొందడం అపూర్వ గౌరవాన్ని సాధించిందన్నారు. తాను పరిశోధనా నేపథ్యంలో భాగంగా అమెరికా, లండన్‌, కెనడా, స్వీడెన్‌, ఐర్లాండ్‌, జపాన్‌, సింగపూర్‌ వంటి దేశాలు పర్యటించినట్లు పేర్కొన్నారు.

చాలా దేశాల‌లోని శాస్త్ర సాంకేతిక సంస్థల‌తో ఎంఓయూ ఉన్నట్లు తెలిపారు. కావున తెలంగాణ విశ్వవిద్యాల‌యంలోని అధ్యాపకుల‌కు, పరిశోధకుల‌కు శాస్త్ర సాంకేతిక రంగాల‌లో అంతర్జాతీయ పరంగా మంచి అవకాశాలు ల‌భించే విధంగా క ృషి చేస్తానని చాలా ద ృఢంగా విశ్వసిస్తున్నట్లు సంతోషం ప్రకటించారు. తదనంతరం రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం, యూజీసి డీన్‌ రూసా డైరెక్టర్‌ ఆచార్య కె. శివశంకర్‌, ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ ఆచార్య పి. కనకయ్య, కంట్రోల‌ర్‌ డా. పాత నాగరాజు, ప్రిన్సిపల్‌ డా. వాసం చంద్రశేఖర్‌, పాల‌కమండలి సభ్యులు డా. మారయ్య గౌడ్‌, డా. కె. రవీందర్‌ రెడ్డి, జాయింట్‌ డైరెక్టర్‌ డా. జి. రాంబాబు, అడ్మిషన్స్‌ డైరెక్టర్‌ డా. కె. సంపత్‌ కుమార్‌, అడిషనల్‌ కంట్రోర్స్‌ డా. అథిక్‌ సుల్తానా ఘోరి, డా. భ్రమరాంబిక, ఎ ఆర్‌ సాయా గౌడ్‌, సూపరిండెంట్‌ భాస్కర్‌, విద్యార్థి నాయకులు పుప్పాల‌ రవి, యెండల‌ ప్రదీప్‌ తదితర సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.

Check Also

ఘనంగా ఎన్‌.ఎస్‌.యూ.ఐ ఆవిర్భావ వేడుకలు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం నిజామాబాద్‌ నగరం కాంగ్రెస్‌ భవన్‌లో ఎన్‌.ఎస్‌. యూ.ఐ ...

Comment on the article