Breaking News

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు మందులు ఇస్తున్నారా మీ ఆరోగ్య విషయాలు పర్యవేక్షణ చేస్తున్నారా అని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి కరోనా వచ్చిన పేషంట్‌ల‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. డోర్‌ టు డోర్‌ సర్వే ద్వారా కరోనా ల‌క్షణాలు ఉన్న 12 మందికి ఆయన మంగళవారం కలెక్టరేట్‌లోని కోవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌ నుండి మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

డోర్‌ టు డోర్‌ సర్వే రెండు విడతల్లో ఆశా వర్కర్లు అంగన్‌వాడీ టీచర్లు ఇతర ఆరోగ్య కార్యకర్తలు మీ ఇళ్లకు వస్తున్నారా కోవిడ్‌కు సంబంధించిన వివరాలు తెలుసుకొని మీకు మందుల‌ కిట్టు అందిస్తున్నారా ఆక్సి మీటర్‌తో మీయొక్క ఆక్సిజన్‌ చెక్‌ చేస్తున్నారా, మీయొక్క ఆరోగ్య సమస్యల‌పై పర్యవేక్షణ చేస్తున్నారా ఇతర సల‌హాలు ఇస్తున్నారా అని ప్రశ్నించారు. అందుకు వారు సానుకూల‌మైన సమాధానాలు ఇచ్చారు.

మీకు ఎలాంటి ప్రాబ్లెమ్‌ ఉన్న తమ దృష్టికి తేవాల‌ని, ఆందోళన చెందవల‌సిన అవసరం లేదని, అవసరమైన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, ఏఓ సుదర్శన్‌, డిఎం అండ్‌ హెచ్‌ఓ బాల‌ నరేంద్ర, కంట్రోల్‌ రూం సిబ్బంది తదితరులు ఉన్నారు.

Check Also

మొబైల్‌ కూరగాయల‌ వాహనాలు ప్రారంభం

నిజామాబాద్‌, మే 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొనసాగుతున్న లాక్‌ డౌన్‌ ను ద ృష్టిలో పెట్టుకొని ...

Comment on the article