Breaking News

అర్దరాత్రి గర్భిణీకి రక్తదానం

కామారెడ్డి, మే 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా రాజంపేట మండలానికి చెందిన వడ్లకొండ భార్గవి (24) అనే మహిళ కు డెలివరీ నిమిత్తం బి. నెగిటివ్‌ రక్తం అవసరం ఉండగా ఉదయం 3 గంటల‌కు కామారెడ్డి రక్తదాతల‌ వాట్సప్‌ గ్రూప్‌ నిర్వాహకులు ఎనుగందుల‌ నవీన్‌, శివ కుమార్‌ను సంప్రదించారు. ఇంత లాక్‌డౌన్‌లో కూడా స్వచ్చందంగా ఉమేష్‌ అనే అపద్బాంధవుడు ఒక్క గంటలో స్పందించి మానవత్వంతో రక్తదానం చేసి ప్రాణాలు కాపాడారు.

భార్గవి వ‌ల్ల‌ భర్త హరి కృష్ణ ఫోన్‌ ద్వారా సంప్రదిస్తే క్షేమ సమాచారాన్ని అడగగా డెలివరీ అయ్యారని పాప జన్మించిందని అత్యవసర సమయంలో రక్తదానానికి ముందుకు వచ్చిన ఉమేష్‌కు వారి కుటుంబం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా కామారెడ్డి రక్తదాతల‌ వాట్సప్‌ గ్రూప్‌ నిర్వాహకులు ఎనుగందుల‌ నవీన్‌, బోనగిరి శివ కుమార్‌లు మాట్లాడుతూ లాక్‌డౌన్‌లో ఆపత్కాల‌ సమయంలో రక్తదాతలు ముందుకు వచ్చి రక్తదానం చేసి ప్రాణదాతలు కావాల‌ని కోరారు. రక్తదానం కార్యక్రమంలో రక్తదాత ఉమేష్‌, వారి కుటుంబ సభ్యులు నగేష్‌, హరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article