Breaking News

డ్రోన్‌ కెమెరాల‌ ద్వారా లాక్‌డౌన్‌ పరిశీల‌న

కామారెడ్డి, మే 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ కేంద్రంలో లాక్‌ డౌన్‌ను మరింత కట్టుదిట్టంగా అమలు చేయుట కొరకు డ్రోన్‌ కెమెరాల‌ ద్వారా కూడా పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. మంగళవారం ఉదయం నుండి డ్రోన్‌ కెమెరాల‌ ద్వారా కామారెడ్డి పట్టణ కేంద్రంలోని అన్ని వీధుల‌ను, ప్రధాన రహదారుల‌ను పరిశీలించారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల‌ సూచనలు, లాక్‌ డౌన్‌ నియమ నిబంధనలు మీడియా ద్వారా, సోషల్‌ మీడియా ద్వారా అందరికి తెలిసినప్పటికిని చాలామంది అవేమీ తమకి పట్టవు అంటూ ఇంకా రోడ్ల మీద తిరగడం, మాస్కులు ధరించకుండా గుమిగూడి మాట్లాడడం, సామాజిక దూరాలు పాటించకపోవడం వంటివి చేస్తున్నారని పేర్కొన్నారు. వారిపై పోలీసు అధికారులు చట్టరీత్యా తగిన చర్య తీసుకోబడుతుందన్నారు.

ఈ విధంగా సోమవారం ఒక్కరోజు, లాక్‌ డౌన్‌ మొదటిరోజు నుండి మంగళవారం వరకు నమోదు చేసిన కేసు వివరాలు వెల్ల‌డించారు. నిబంధనల‌కు విరుద్ధంగా వ్యవహరించిన వ్యాపార సంస్థల‌పై 6 (242) కేసులు నమోదు చేయడం జరిగినదని, అలాగే 376 (3950) మంది నిబంధనలు పాటించక పోవడం వల‌న జరిమానాలు విధించడం జరిగిందన్నారు. అలాగే 195 (991) వాహనాల‌ను కూడా సీజ్‌ చేయడం జరిగిందన్నారు.

ప్రభుత్వం కల్పించిన వెసులుబాటు సమయం ఉదయం 6 గంటల‌ నుంచి 10 గంటల‌ వరకు అందరూ ఒకేసారి గుమిగూడి ఉండకుండా నిబంధనలు పాటించాల్సిందిగా కోరారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article