Breaking News

నందిపేట్‌లో భారీ చోరీ

నందిపేట్‌, మే 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండల‌ కేంద్రంలోని బర్కత్‌పుర కాలోనిలో భారీ చోరీ జరిగింది. వివరాల‌కు వెళితే డొంకేశ్వర్‌ గ్రామానికి చెందిన అబ్దుల్‌ ఖాదర్‌ అలియాస్‌ మద్వా నందిపేట్‌లోని ఆర్మూర్‌ బై పాస్‌ ప్రక్కన గ బరకత్‌పుర కాలోనిలో 10 సంవత్సరాల‌ క్రితం ఇల్లు నిర్మించి భార్య పిల్ల‌ల‌ను ఇక్కడ ఉంచి పొట్టకూటి కోసం దుబాయ్‌లో వల‌స లేబర్‌గా పని చేస్తూ భార్య పిల్ల‌ల‌ను పోషించుకుంటున్నాడు.

అయితే అతని భార్య తమ్ముడు నెల‌ రోజుల‌ క్రితం నవీపేట్‌లో మృతి చెందడంతో భార్య పిల్ల‌లు ఇంటికి తాళం వేసి నెల‌ రోజుల‌ నుండి నవీపేట్‌లో వుండి సోమవారం సాయంత్రం నందిపేట్‌ వచ్చి ఇంటికి చేరగానే ఇంటి తాళం పగిలిన ద ృశ్యం చూసి గుండె పగిలినంత పని అయింది.

లోపలికి వెళ్లి చూడగా రెండు అల‌మరలు పగుల‌గొట్టి అందులోనుండి కూతురు పెళ్లి నిమిత్తం ఉంచిన ఐదు తులాల‌ బంగారం, 1 ల‌క్ష 75 వేల‌ నగదు దొంగతనం జరిగినట్లు గ్రహించి పోలీసుల‌కు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న నందిపేట్‌ 2వ ఎస్‌ఐ అరిఫ్‌ ఖాన్‌ పోలీసు సిబ్బందితో చేరుకొని పంచనామా నిర్వహించి దర్యాప్తు ప్రారంభించారు.

Check Also

సిఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కు పంపిణీ

నందిపేట్‌, జూలై 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలం తొండకూరు గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిధి సీఎంఆర్‌ఎఫ్‌ ...

Comment on the article