Breaking News

కష్టకాలంలో పని కల్పించాలి

కామారెడ్డి, మే 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ కష్టకాలంలో గ్రామాల‌లో ప్రతి ఒక్కరికీ పని కల్పించాల‌ని, కూలీల‌ శాతం పెరిగేలా అధికారులు క్షేత్రస్థాయిలో పని చేయాల‌ని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ ఉపాధి హామీ అధికారుల‌ను ఆదేశించారు.

మంగళవారం ఆయన జిల్లా స్థానిక సంస్థల‌ అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే, జిల్లా ఇన్చార్జి అదనపు కలెక్టర్‌, జిల్లా గ్రామీణ అభివ ృద్ధి అధికారి బి.వెంకట మాధవ రావు, జిల్లా పంచాయతీ అధికారి సాయన్న, మండల‌ అభివ ృద్ధి అధికారులు, మండల‌ పంచాయతీ అధికారులు, ఏపీడి, ఎపిఓతో సెల్‌ కాన్ఫరెన్సు ద్వారా మండలాల‌ వారీగా ఉపాధి హామీ పనుల‌ను, కూలీల‌ శాతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సంక్షోభంలో గ్రామాల‌లో ప్రతి ఒక్కరి ఆర్థిక వెసులుబాటుకు ఉపాధి హామీ పనులు కల్పించాల‌ని, గుర్తించిన పనులు ప్రారంభించాల‌ని ఆదేశించారు.

జుక్కల్‌, లింగంపేట, గాంధారి, నిజాంసాగర్‌, మాచారెడ్డి మండలాల‌లో కూలీల‌ శాతం తక్కువగా నమోదయిందని, కూలీల‌ శాతం పెరిగేలా అధికారులు సమన్వయంతో క్షేత్రస్థాయిలో పని చేయాల‌ని ఆదేశించారు. గ్రామాల‌లో శ్రమశక్తి సంఘాల‌తో సమావేశాలు ఏర్పాటు చేసుకుని పనులు గురించి అవగాహన కల్పించాల‌ని, గుర్తించిన పనుల‌ను వెంటనే ప్రారంభించాల‌ని, సోమవారంలోగా నిర్దేశిత ల‌క్ష్యాల‌ను సాధించాల‌ని అన్ని మండలాల‌ ఉపాధి హామీ అధికారుల‌ను ఆదేశించారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article