Breaking News

రాజ్యసభ సభ్యులు సురేశ్‌రెడ్డి మొక్కలు నాటారు…

హైదరాబాద్‌, మే 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తన పుట్టినరోజు సందర్భంగా గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటడం జరిగిందని రాజ్య సభ సభ్యులు కే. ఆర్‌. సురేశ్‌ రెడ్డి పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌ కుమార్ పిలుపుమేరకు మంగళవారం తన పుట్టినరోజును పురస్కరించుకుని రాజ్య సభ సభ్యులు సురేష్‌ రెడ్డి బంజారా హిల్స్‌లోని తన నివాసంలో గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా వారి మనవరాళ్లతో కలిసి మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ఎం.పీ మాట్లాడుతూ పచ్చదనం పెంచడం కోసం ప్రతి ఒక్కరూ క ృషి చేయాల‌ని తన పుట్టినరోజు సందర్భంగా రాజ్యసభ సభ్యులు సంతోష్‌ కుమార్ పిలుపు మేరకు తన మనవరాళ్లతో కలిసి మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందని ప్రతి ఒక్కరు కూడా ఇదేవిధంగా మొక్కలు నాటాల‌ని తన ప్రాంత ప్రజల‌కు పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన రాజ్యసభ సభ్యులు సంతోష్‌ కుమార్‌కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపి, శుభాకాంక్ష‌లు తెలిపిన ప్రతీఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు.

Check Also

విద్యాశాఖా మంత్రిని మ‌ర్యాద పూర్వ‌కంగా కలిసిన టీయూ వీసీ

డిచ్‌ప‌ల్లి, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖా మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి ని ...

Comment on the article