Breaking News

Daily Archives: May 26, 2021

హోమ్ ఐసోలేషన్‌కు వసతి లేని వారిని ప్రభుత్వ ఐసొలేషన్‌లో వుంచాలి

కామారెడ్డి, మే 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః పాజిటివ్ కేసులు ఎక్కువగా వస్తున్న ఆరోగ్య కేంద్రాల పరిధిలో మెడికల్, రెవిన్యూ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన సెల్ కాన్ఫరెన్స్ ద్వారా రెవిన్యూ డివిజనల్ అధికారులు, జిల్లా వైద్య అధికారి, డిప్యూటీ డిఎంహెచీలు, తహశీలుదార్లు, ఆరోగ్య కేంద్రాల మెడికల్ ఆఫీసర్లతో పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న ఆరోగ్య కేద్రాల టీములతో సమీక్షించారు. పాజిటివ్ కేనులు ఎందుకు ఎక్కువగా నమోదు అవుతున్న ...

Read More »

సమాచార హక్కు చట్టం ఆధ్వర్యంలో మాస్కుల పంపిణీ…

కామారెడ్డి, మే 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః బుధ‌వారం కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండల కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయంలో రెవెన్యూ సిబ్బందికి అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఎంఆర్‌వో గోవర్ధన్ చేతుల మీదుగా మాస్కులు పంపిణీ చేసిన‌ట్టు జిల్లా ఇంచార్్జ‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకం శ్యామ్ రావు అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో గోవర్ధన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు లాక్ డౌన్ నిబంధనలు పాటించాలని, ప్రతి ఒక్కరు మాస్కు ధరించి సామాజిక దూరాన్ని ...

Read More »

31వరకు టీఎస్ ఈసెట్ ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు పొడగింపు..

హైద‌రాబాద్‌, మే 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః తెలంగాణ ఈ సెట్‌–21 ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు గడువును మ‌రోమారు పొడిగించారు. క‌రోనా నేప‌థ్యంలో ఈ నెల 31 వ‌ర‌కు విద్యార్థుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పిస్తున్న‌ట్లు టీఎస్‌ ఈ సెట్‌ కన్వీనర్ సీహెచ్‌.వెంకటరమణారెడ్డి తెలిపారు. షెడ్యూల్ ప్ర‌కారం ద‌ర‌ఖాస్తు గ‌డువు ఈనెల 18న ముగిసింది. అయితే రాష్ట్రంలో విస్త‌రిస్తున్న క‌రోనా వైర‌స్‌ను నిలువ‌రించ‌డానికి ప్ర‌భుత్వం లాక్‌డౌన్ విధించింది. దీంతో ఎలాంటి అపరాధ రుసుము లేకుండా మే 24 వరకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ...

Read More »

లాక్‌డౌన్ ప‌రిశీలించిన ఎస్‌పి శ్వేత‌

కామారెడ్డి, మే 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కరోనా విజృంభణ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను విధించిన సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో పలు కూడళ్లలో, ప్రస్తుతము దేవునిపల్లీలోని ప్రధాన రహాదారిలో వివిధ వీధుల గుండా ప్రత్యేకంగా ఎస్పీ శ్వేతా రెడ్డి నడుచుకుంటూ ప్రజల రాక పొకలపై దృష్టి సారించారు. అనవసరంగా రోడ్లపైకి వ‌చ్చి పోయె వారి పట్ల దృష్టి సారించి నిబంధ‌నలు ఉల్లంఘించిన వారి పట్ల కఠినంగా చర్యలు తీసుకుంటు తానే స్వయంగా ప్రతి రోజు ప్రజల ...

Read More »

స‌మ్మె విర‌మించి విధుల్లో చేరాలి

హైద‌రాబాద్, మే 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కరోనా విపత్కర పరిస్థితుల్లో సమ్మెకు పిలుపునివ్వడం మంచిది కాదని, ఇటువంటి కీలక సమయంలో ప్రజారోగ్యాన్ని దృష్టిలో వుంచుకుని తక్షణమే విధుల్లో చేరాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు జూనియర్ డాక్టర్లకు సూచించారు. ప్రభుత్వం, జూనియర్ డాక్టర్ల పట్ల ఏనాడూ వివక్ష చూపలేదని వారి సమస్యలను పరిష్కరిస్తూనే వున్నదని ఇప్పుడు కూడా న్యాయమైన కోరికలను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా వున్నదని సీఎం స్పష్టం చేశారు. బుధ‌వారం ప్రగతి భవన్లో వైద్యశాఖ అధికారులతో రాష్ట్రంలో కరోనా ...

Read More »

13 మంది పేకాటరాయుళ్ల అరెస్టు

మోర్తాడ్, మే 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః మోర్తాడ్ మండలం వడ్యాట్ గ్రామ శివారులో మంగళవారం పేకాట ఆడుతున్న 13 మందిని అరెస్టు చేసినట్లు మోర్తాడ్ ఎస్ఐ సురేష్ కుమార్ తెలిపారు. పేకాట ఆడుతున్న వారి వద్ద నుండి 9 వేల 930 రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. మోర్తాడ్ పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో గ్రామ పొలిమేరలో పేకాట ఆడుతున్న సమాచారం తెలియగానే పోలీసులు వెళ్లి పేకాట ఆడుతున్న వారిని అదుపులోకి తీసుకున్నామని, వారిని అరెస్టు చేసి రిమాండ్ ...

Read More »

ఆక్సీజ‌న్ సిలిండ‌ర్లు అంద‌జేస్తున్న ష‌బ్బీర్ అలీ

కామారెడ్డి, మే 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః బుధ‌వారం మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్ అలీ షబ్బీర్, షబ్బీర్ అలీ ఫౌండేషన్ ద్వారా కరోనా వ్యాధితో బాధపడుతున్న బిక్నూర్ మండల రామేశ్వర్ పల్లి గ్రామానికి చెందిన నాగతి రాజిరెడ్డికి, ర్యగట్ల పల్లి గ్రామానికి చెందిన పాపయ్యగారి లక్ష్మికి ఆక్సిజన్ అంద‌జేశారు. ఆక్సిజన్ అందించడం ద్వారా వ్యాధి సోకిన ఎన్నో పేద కుటుంబాలను షబ్బీర్ అలీ వారి స్వచ్ఛంద సంస్థ ద్వారా ఆదుకున్నారని బాధితులు కొనియాడారు. మహమ్మద్ అలీ ...

Read More »

అంబులెన్స్ ప్రారంభం

నిజామాబాద్‌, మే 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ఎన్ఆర్ఐ దాతలు డొనేట్ చేసిన అంబులెన్్స‌ను జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రారంభించారు. నిర్మాణం ఇండియా తరఫున నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో పటాలోళ్ల మోహన్ రెడ్డి, పడిగెల రాజు ఇతర ఎన్ఆర్ఐల‌ డొనేషన్ తో ప్రభుత్వ ఆస్పత్రికి అంబులెన్్స‌ను డొనేట్ చేశారు. బుధవారం నాడు కలెక్టర్ ఛాంబర్ వద్ద అంబులెన్్స‌ను కలెక్టర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అంబులెన్్స‌ అందించినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సంబంధిత ప్రతినిధులు ...

Read More »

28, 29 తేదీల్లో సూపర్ స్పైడర్స్ కు వ్యాక్సినేషన్

నిజామాబాద్‌, మే 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః రేషన్ షాప్ డీలర్లు, ఎల్‌పిజి డిస్ట్రిబ్యూటర్లు, పెట్రోల్ బంకులు, ఫెర్టిలైజర్, పెస్టిసైడ్స్, సీడ్స్ డీలర్స్, వాటిలో పని చేసేవారు, జర్నలిస్టులకు ఈ నెల 28, 29 తేదీలలో వ్యాక్సినేషన్ కొరకు జాబితాలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన సంబంధిత అధికారులతో సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం రేషన్ షాపు డీలర్లు వాటిల్లో పనిచేసే సహాయకులు ...

Read More »

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య (80) ఆపరేషన్‌ నిమిత్తమై పట్టణంలోని శ్రీ రామ వైద్యశాల‌లో ఓ నెగిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల‌ సమూహ నిర్వాహకులు బాలును సంప్రదించారు. బిబీపేట మండలం రామ్‌ రెడ్డిపల్లికి గ్రామానికి చెందిన లావణ్య సహకారంతో ఓ నెగిటివ్‌ రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ నేటి సమాజానికి లావణ్య ఎంతో ఆదర్శమని లాక్‌ డౌన్‌ ...

Read More »

నేటికి ఆరునెల‌లు పూర్తయింది

ఆర్మూర్‌, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏఐకెఎస్‌సిసి దేశవ్యాప్తంగా న‌ల్ల‌ జండాలు ఎగరేసి నిరసన తెల‌పాల‌ని ఇచ్చిన పిలుపు మేరకు సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ ఆర్మూర్‌ సబ్‌ డివిజన్‌ కమిటీ ఆధ్వర్యంలో ఆర్మూర్‌ పట్టణ కేంద్రంలో న్యూడెమోక్రసీ కార్యాల‌యం కుమార్‌ నారాయణ భవన్‌ వద్ద న‌ల్ల‌ జండాలు ఎగరేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా న్యూడెమోక్రసీ ఆర్మూర్‌ సబ్‌ డివిజన్‌ కార్యదర్శి ముత్తెన్న మాట్లాడుతు రైతు వ్యతిరేక మూడు చట్టాలు రద్దు చేయాల‌ని రైతాంగం ఆందోళన చేపట్టి నేటికి ఆరునెల‌లు ...

Read More »

బోధన్‌లో న‌ల్ల‌జెండాల‌తో ప్రదర్శన

బోధన్‌, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏఐకేఎస్‌సీసీ పిలుపు మేరకు బోధన్‌ పట్టణంలో సీపీఐ (ఎం- ఎల్‌) న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో న‌ల్ల‌ జండాల‌తో అంబేద్కర్‌ చౌరస్తాలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ సబ్‌ డివిజన్‌ కమిటీ కార్యదర్శి బి మల్లేష్‌ మాట్లాడుతూ ఈ రోజుకు (2021 మే 26) రైతు సంఘాలు సంయుక్తంగా డిల్లీని చుట్టి వేసి రైతులు చేస్తున్న ఆందోళనకు 6 నెల‌లు (180 రోజులు) గడుస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించు కోవడం ...

Read More »