Breaking News

13 మంది పేకాటరాయుళ్ల అరెస్టు

మోర్తాడ్, మే 26

నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః మోర్తాడ్ మండలం వడ్యాట్ గ్రామ శివారులో మంగళవారం పేకాట ఆడుతున్న 13 మందిని అరెస్టు చేసినట్లు మోర్తాడ్ ఎస్ఐ సురేష్ కుమార్ తెలిపారు.

పేకాట ఆడుతున్న వారి వద్ద నుండి 9 వేల 930 రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. మోర్తాడ్ పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో గ్రామ పొలిమేరలో పేకాట ఆడుతున్న సమాచారం తెలియగానే పోలీసులు వెళ్లి పేకాట ఆడుతున్న వారిని అదుపులోకి తీసుకున్నామని, వారిని అరెస్టు చేసి రిమాండ్ చేశామని తెలిపారు.

Check Also

ఈజీఎస్‌ పనులు పరిశీలించిన ఎంపీడీవో

మోర్తాడ్‌, మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండల‌ కేంద్రంలో జరుగుతున్న ఈజీఎస్‌ పనుల‌ను శనివారం ...

Comment on the article