Breaking News

బోధన్‌లో న‌ల్ల‌జెండాల‌తో ప్రదర్శన

బోధన్‌, మే 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏఐకేఎస్‌సీసీ పిలుపు మేరకు బోధన్‌ పట్టణంలో సీపీఐ (ఎం- ఎల్‌) న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో న‌ల్ల‌ జండాల‌తో అంబేద్కర్‌ చౌరస్తాలో నిరసన ప్రదర్శన నిర్వహించారు.

ఈ సందర్భంగా పార్టీ సబ్‌ డివిజన్‌ కమిటీ కార్యదర్శి బి మల్లేష్‌ మాట్లాడుతూ ఈ రోజుకు (2021 మే 26) రైతు సంఘాలు సంయుక్తంగా డిల్లీని చుట్టి వేసి రైతులు చేస్తున్న ఆందోళనకు 6 నెల‌లు (180 రోజులు) గడుస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించు కోవడం లేదని దుయ్యబట్టారు. కేంద్రం లోని మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం రైతాంగానికి నష్టం చేసే మూడు రైతు వ్యతిరేక న‌ల్ల‌ చట్టాల‌ను, కేంద్ర విద్యుత్ బిల్లును రద్దుచేయాలంటూ, రైతు కష్ట పడి పండించే పంటకు కనీస మద్దతు ధర గ్యారంటీ చట్టం చేయాల‌ని డిమాండ్‌ చేశారు.

కార్మిక వ్యతిరేక లేబర్‌ కోడ్‌ను రద్దు చేయాల‌ని, కరోనా బాధితులందరికి వైద్యం ఉచితంగా ప్రభుత్వమే చేయాలంటూ, తడిసిన వరి దాన్యంతో సహా మొత్తం దాన్యాన్ని ప్రభుత్వమే నెల‌ లోపు సేకరించాల‌ని, కొనుగోలు చేసిన దాన్యం డబ్బు రైతు ఖాతాల్లో వెంటనే వేయాల‌ని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పడాల శంకర్‌, సుల్తాన్‌ సాయులు, బి.నాగమని, సీహెచ్‌ గంగయ్య, జి.శ్రీను, సీహెచ్‌.యాదగిరి గౌడ్‌, గడ్డం నాగయ్య, పోశెట్టి, గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

ప్రజాస్వామ్యం ప్రమాదంలోకి నెట్ట బడుతుంది

బోధన్‌, మార్చ్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీజేపీ పాల‌నలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని ఐఎఫ్‌టీయూ జిల్లా ...

Comment on the article