Breaking News

సమాచార హక్కు చట్టం ఆధ్వర్యంలో మాస్కుల పంపిణీ…

కామారెడ్డి, మే 26

నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః బుధ‌వారం కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండల కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయంలో రెవెన్యూ సిబ్బందికి అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఎంఆర్‌వో గోవర్ధన్ చేతుల మీదుగా మాస్కులు పంపిణీ చేసిన‌ట్టు జిల్లా ఇంచార్్జ‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకం శ్యామ్ రావు అన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మార్వో గోవర్ధన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు లాక్ డౌన్ నిబంధనలు పాటించాలని, ప్రతి ఒక్కరు మాస్కు ధరించి సామాజిక దూరాన్ని పాటించి కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని అన్నారు. ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే ప్రజలు వారి అవసరాల మేరకే బయటకు రావాలని అన్నారు.

రైతులు వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద సామాజిక దూరాన్ని పాటించాలని మాస్కులు ధరించాలని గుంపులు గుంపులుగా ఉండరాదని అన్నారు. సమాచార హక్కు చట్టం 2005 అవగాహన సదస్సులతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు స్వచ్ఛందంగా నిర్వహించడం అభినందనీయమని ఈ సందర్భంగా సమాచార హక్కు చట్టం ప్రతినిధులను అభినందించారు.

కార్యక్రమంలో డిప్యూటీ ఎమ్మార్వో కౌశిక, ఆర్ఐ రాజు, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు మోతే లావణ్య , రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Check Also

డ్రోన్‌ కెమెరాల‌ ద్వారా లాక్‌డౌన్‌ పరిశీల‌న

కామారెడ్డి, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ కేంద్రంలో లాక్‌ డౌన్‌ను మరింత కట్టుదిట్టంగా ...

Comment on the article