Breaking News

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య (80) ఆపరేషన్‌ నిమిత్తమై పట్టణంలోని శ్రీ రామ వైద్యశాల‌లో ఓ నెగిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల‌ సమూహ నిర్వాహకులు బాలును సంప్రదించారు. బిబీపేట మండలం రామ్‌ రెడ్డిపల్లికి గ్రామానికి చెందిన లావణ్య సహకారంతో ఓ నెగిటివ్‌ రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడారు.

ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ నేటి సమాజానికి లావణ్య ఎంతో ఆదర్శమని లాక్‌ డౌన్‌ కొనసాగుతున్నప్పటికీ 35 కిలోమీటర్ల దూరం నుండి వచ్చి రక్తదానం చేయడం నేటి యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. గతంలో కూడా నాలుగు సార్లు రక్తదానం చేశారన్నారు. లావణ్యను స్ఫూర్తిగా తీసుకొని ఆపద సమయంలో రక్తదానం చేయడానికి ముందుకు రావాల‌న్నారు. రక్తదానం చేసిన లావణ్యను అభినందించారు. కార్యక్రమంలో వి.టి. ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంక్‌ టెక్నీషియన్‌ చందన్‌ పాల్గొన్నారు.

Check Also

డ్రోన్‌ కెమెరాల‌ ద్వారా లాక్‌డౌన్‌ పరిశీల‌న

కామారెడ్డి, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ కేంద్రంలో లాక్‌ డౌన్‌ను మరింత కట్టుదిట్టంగా ...

Comment on the article