Breaking News

31వరకు టీఎస్ ఈసెట్ ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు పొడగింపు..

హైద‌రాబాద్‌, మే 26

నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః తెలంగాణ ఈ సెట్‌–21 ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు గడువును మ‌రోమారు పొడిగించారు. క‌రోనా నేప‌థ్యంలో ఈ నెల 31 వ‌ర‌కు విద్యార్థుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పిస్తున్న‌ట్లు టీఎస్‌ ఈ సెట్‌ కన్వీనర్ సీహెచ్‌.వెంకటరమణారెడ్డి తెలిపారు.

షెడ్యూల్ ప్ర‌కారం ద‌ర‌ఖాస్తు గ‌డువు ఈనెల 18న ముగిసింది. అయితే రాష్ట్రంలో విస్త‌రిస్తున్న క‌రోనా వైర‌స్‌ను నిలువ‌రించ‌డానికి ప్ర‌భుత్వం లాక్‌డౌన్ విధించింది. దీంతో ఎలాంటి అపరాధ రుసుము లేకుండా మే 24 వరకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. కాగా, నేటితో గ‌డువు ముగియ‌డంతో మ‌రోమారు పొడిగించారు.

ప‌రీక్ష ద్వారా ఇంజినీరింగ్ డిప్లొమా, బీఎస్సీ మ్యాథ్స్ కోర్సులు చేస్తున్న‌వారికి బీటెక్ సెకండియ‌ర్‌లోకి ప్ర‌వేశాలు క‌ల్పిస్తారు. ప‌రీక్ష‌ను టిఎస్‌సిహెచ్ఇ త‌ర‌ఫున జేఎన్‌టీయూ నిర్వ‌హిస్తున్న‌ది. కాగా ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.800, ఎస్సీ, ఎస్టీ అభ్య‌ర్థుల‌కు రూ.400 గా నిర్ణ‌యించారు.

Check Also

టిఎస్‌పిఎస్‌సి సభ్యులు వీరే…

హైదరాబాద్‌, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌, సభ్యుల‌ను బుధవారం, ...

Comment on the article