Breaking News

ఆక్సీజ‌న్ సిలిండ‌ర్లు అంద‌జేస్తున్న ష‌బ్బీర్ అలీ

కామారెడ్డి, మే 26

నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః బుధ‌వారం మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్ అలీ షబ్బీర్, షబ్బీర్ అలీ ఫౌండేషన్ ద్వారా కరోనా వ్యాధితో బాధపడుతున్న బిక్నూర్ మండల రామేశ్వర్ పల్లి గ్రామానికి చెందిన నాగతి రాజిరెడ్డికి, ర్యగట్ల పల్లి గ్రామానికి చెందిన పాపయ్యగారి లక్ష్మికి ఆక్సిజన్ అంద‌జేశారు.

ఆక్సిజన్ అందించడం ద్వారా వ్యాధి సోకిన ఎన్నో పేద కుటుంబాలను షబ్బీర్ అలీ వారి స్వచ్ఛంద సంస్థ ద్వారా ఆదుకున్నారని బాధితులు కొనియాడారు. మహమ్మద్ అలీ షబ్బీర్ త‌మ కుటుంబాలకు సమయానికి దేవునిలా మాకు ప్రాణవాయువు అందించి త‌మ‌ ప్రాణాలు కాపాడారని కొనియాడారు.

అలాగే దోమకొండ మండల కేంద్రంలోని కంది కాళిదాసు, ఆర్ఎంపీ డాక్టర్ కరోనా వ్యాధితో బాధ పడుతున్న తరుణంలో ఆయన కుటుంబ సభ్యులు ఆక్సిజన్ అవసరమని షబ్బీర్ అలీ ట్రస్టుకు ఫోన్ చేయగా, వారు వెంటనే స్పందించి ఆక్సిజన్ అంద‌జేసి ప్రాణాలు కాపాడారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు షబ్బీర్ అలీ ఆక్సిజన్ అందించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, ఆయన త‌మ కుటుంబానికి చెందిన పెద్దదిక్కును ఆపద్బాంధవుడ‌నీ ఆదుకున్నారని తెలిపారు.

దోమకొండ ప్రజలు మాట్లాడుతూ మహ్మద్ అలీ షబ్బీర్ గత సంవత్సరం కరోనా సమయంలో గ్రామపంచాయతీ వర్కర్లకు, ఏఎన్ఎం లకు, బీదకుటుంబాలకు బియ్యము, నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారనీ షబ్బీర్ అలీ ఆయన ఫౌండేషన్ ద్వారా ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు చేపడుతూ ప్రజల ఆద‌ర అభిమానాలు పొందుతున్నార‌న్నారు.

అదేవిధంగా దోమకొండ లో 30 పడకల ఆసుపత్రి షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో నే పూర్తి చేయడం జరిగింద‌ని గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు అనంత రెడ్డి, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మధుసూదన్‌, సీనియర్ కాంగ్రెస్ నాయకులు అమ్ములు, ముకుందం, వంశీ, లాక్క పతిని గంగాధర్ పాల్గొన్నారు.

Check Also

డ్రోన్‌ కెమెరాల‌ ద్వారా లాక్‌డౌన్‌ పరిశీల‌న

కామారెడ్డి, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ కేంద్రంలో లాక్‌ డౌన్‌ను మరింత కట్టుదిట్టంగా ...

Comment on the article