Breaking News

హోమ్ ఐసోలేషన్‌కు వసతి లేని వారిని ప్రభుత్వ ఐసొలేషన్‌లో వుంచాలి

కామారెడ్డి, మే 26

నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః పాజిటివ్ కేసులు ఎక్కువగా వస్తున్న ఆరోగ్య కేంద్రాల పరిధిలో మెడికల్, రెవిన్యూ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన సెల్ కాన్ఫరెన్స్ ద్వారా రెవిన్యూ డివిజనల్ అధికారులు, జిల్లా వైద్య అధికారి, డిప్యూటీ డిఎంహెచీలు, తహశీలుదార్లు, ఆరోగ్య కేంద్రాల మెడికల్ ఆఫీసర్లతో పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న ఆరోగ్య కేద్రాల టీములతో సమీక్షించారు.

పాజిటివ్ కేనులు ఎందుకు ఎక్కువగా నమోదు అవుతున్న కారణాలను పరిశీలించాలని, పాజిటివ్ కేసులు గుర్తించిన వారి ప్రయిమరీ, సెకండరీ కాంటాక్ట్ ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షించాలని, వారిని హోమ్ ఐసొలేషన్ చేయాలని, కిట్స్ అందచేయాలని తెలిపారు.

హోమ్ ఐసోలేషన్‌కు వసతి లేని వారిని ప్రభుత్వ ఐసొలేషన్‌లో వుంచాలని తెలిపారు. గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్లు, ప్రజాప్రతినిధుల సహకారంతో కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేయాలని, గ్రామం, సబ్‌సెంటర్ వారిగా అవసరమైన చోట ఐసొలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, వారి ఆరోగ్య పరిస్థితులను రోజుకు రెండు సార్లు పరీక్షించాలని, పాజిటివ్ చైన్ లింక్ తెగే విధంగా పనితీరు కనబరచాలని, ఐనొలేషన్‌లో వున్న వారి ఆరోగ్య పరిస్థితులను ప్రతి రోజూ క్రాస్ చెక్ చేసుకోవాలని తెలిపారు.

Check Also

డ్రోన్‌ కెమెరాల‌ ద్వారా లాక్‌డౌన్‌ పరిశీల‌న

కామారెడ్డి, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ కేంద్రంలో లాక్‌ డౌన్‌ను మరింత కట్టుదిట్టంగా ...

Comment on the article