Breaking News

Daily Archives: May 27, 2021

రైతుకవి వెలపాటి ఇకలేరు…

హైద‌రాబాద్‌, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః తెలంగాణ పద్యకవి, ప్రభుత్వ విశిష్ట పురస్కార గ్రహీత వెలపాటి రామరెడ్డి మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. వ్యవసాయం, రైతు సమస్యలను తన కవిత్వం ద్వారా ఆవిష్కరించిన రైతుకవి వెలపాటి అని సీఎం గుర్తుచేసుకున్నారు. తెలంగాణే ప్రధాన వస్తువుగా రచనా వ్యాసాంగాన్ని సాగించిన వెలపాటి మరణంతో తెలంగాణ ఒక ఉత్తమ సాహితీవేత్తను కోల్పోయిందని సీఎం విచారం వ్యక్తం చేశారు. దివంగత వెలపాటి రామరెడ్డి కుటుంబ సభ్యులకు సీఎం తన ...

Read More »

ఉర్దూ జ‌ర్న‌లిస్టుకు రూ.5 ల‌క్ష‌లు కేంద్రం ఆర్థిక సహాయం

కామారెడ్డి, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ (టీజేఏ), ఎన్ యూజె (ఐ)న్యూఢిల్లీ వారి కృషి ఫలితంగా బుధవారం కేంద్ర ప్రచార మంత్రిత్వ శాఖ నుండి హైద్రాబాద్ కు చెందిన సీనియర్ ఉర్డు జర్నలిస్ట్ అలం మెహిది కుటుంబానికి 5లక్షల రూపాయలు మంజూరు అయినట్లు ఎన్యూజె (ఐ)న్యూఢిల్లీ మాజీ చైర్మన్ , ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు ఉప్పల లక్ష్మన్ తెలిపారు. జర్నలిస్ట్ అలం మెహిది మెదటి విదత కోవిడ్ సోకి మృతి చెందారని, ...

Read More »

జర్నలిస్టు బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం

ఆర్మూర్‌, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జర్నలిస్ట్ బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ప్రెస్ క్లబ్ ఆర్మూర్ అధ్యక్షుడు గుమ్మడి శంకర్ అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ గ్రామంలో గల మహిళ సమాఖ్య భవనంలో గురువారం ఇటీవల మృతి చెందిన ఇద్దరు జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేశారు. ప్రెస్ క్లబ్ కార్యవర్గం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా మృతి చెందిన రాచర్ల రాజేశ్వర్, ఆల్గోట్ జ్ఞానేశ్వర్ ఆత్మలకు శాంతి చేకూర్చాలని ...

Read More »

సీఎం కేసీఆర్ కు దత్తాపూర్ దళిత కుటుంబాల రైతుల లేఖలు

ఆర్మూర్‌, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః మంత్రి ఈటెల రాజేందర్ విషయంలో రైతులు రాసిన లేఖలతో సీఎం కేసీఆర్ రెవెన్యూ యంత్రాంగాన్ని విచారణ చేయాలని ఆదేశించినట్టుగానే, నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం దత్తపూర్ గ్రామ శివారులో గల వ్యవసాయ భూమి విషయంలో కూడా విచారణ చేపట్టాలని ఎమ్ఆర్ పిఎస్ జిల్లా అధ్యక్షులు బాలు గురువారం డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట్ మండలం దత్తపూర్ గ్రామంలో ఉన్న 24 ఎకరాల భూమిని స్థానికం గా లేని వేరే ...

Read More »

మిగ‌తా ల‌క్ష్యాన్ని త్వ‌ర‌లో పూర్తి చేస్తాం..

కామారెడ్డి, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జిల్లాలో ఇప్పటి వరకు 3 లక్షల 87 వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు జరిగినట్లు జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్ తెలిపారు. గురువారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ టెలికాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో ధాన్యం కొనుగోళ్లపై జిల్లాల వారిగా సమీక్షించారు. వర్షాకాలం సమీపిస్తున్నందున ధాన్యం కొనుగోళ్లు వేగంగా పూర్తి చేసుకోవాలని, రైతుల నుండి కొనుగోలు కాగానే వెంటనే వారి ఖాతాలలో డబ్బు జమ అయ్యేలా చూడాలని తెలిపారు. జిల్లా ...

Read More »

నిజామాబాద్ లో బ్లాక్ ఫంగస్‌కు చికిత్స,

నిజామాబాద్‌, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జిల్లాలో కరోనా వైరస్ తగ్గుతూ వస్తున్నదని, బ్లాక్ ఫంగస్ కు నిజామాబాద్ లోనే చికిత్స చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని, 6 వేల మంది సూపర్ స్పైడర్ లకు 28, 29 తేదీలలో వ్యాక్సిన్ వేస్తున్నామని, కోవిడ్ విషయములో ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. గురువారం కలెక్టర్ చాంబర్లో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, కమిషనర్ ఆఫ్ ...

Read More »

31 లోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి కావాలి

కామారెడ్డి, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ఈనెల 31 లోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి కావాలని జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన సెల్ కాన్ఫరెన్స్ ద్వారా ధాన్యం కొనుగోలు పూర్తి కాని కేంద్రాలకు సంబంధించి ఆర్డిఓలు, తహశీలుదార్లు, ప్యాక్స్ సిఇఓలు, వ్యవసాయ ఎఓలు, సివిల్ సప్లయ్ అధికారులతో సమీక్షించారు. కొనుగోళ్లు పూర్తి అయిన కేంద్రాల నుండి హమాలీలు, యంత్ర పరికరాలు డైవర్ట్ చేసి మిగిలిన కొనుగోలు కేంద్రాలలో రైతుల నుండి వేగంగా కొనుగోళ్లు పూర్తి ...

Read More »

వృద్ధ కళాకారుల పెన్షన్ రూ. 3016 కు పెంపుద‌ల‌

హైద‌రాబాద్‌, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః గురువారం తెలంగాణ రాష్ట్రం లో వృద్ధ కళాకారులకు 1500 వందల రూపాయల నుండి రూపాయలు 3016 కు వృధ్యాప్య పెన్షన్లు పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కి రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. పెంచిన వృద్ధ కళాకారుల పెన్షన్లు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2 – 2021 నుండి కళాకారులకు వర్తింపజేయాలని ప్రభుత్వం ...

Read More »

వర్షాకాలంలో నీటిని తోడేందుకు పల్లికొండ లిఫ్ట్ పూర్తి సిద్ధం

భీమ్‌గ‌ల్‌, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని భీంగల్, వేల్పూర్ మండలాల్లో రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గురువారం పర్యటించారు. ముందుగా వేల్పూర్ మండలం జానకం పేట గ్రామం మల్లాడీ చెరువుని పాత నిజాంసాగర్ కెనాల్ నుండి నింపడానికి ఫీడర్ చానల్ లో కొంత భాగము పైప్ లైన్ వేయాల్సిన అవసరం ఉండటంతో పైప్ లైన్ వేయాల్సిన ఫీడర్ చానల్ స్థలాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ...

Read More »

అవ‌స‌ర‌మైన విత్త‌నాలు స‌ర‌ఫ‌రా చేయాలి

కామారెడ్డి, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కామారెడ్డి నియోజకవర్గ పరిధిలో గత రెండు రోజులుగా దాదాపు అన్ని సహకార సంఘాల వద్ద జీలుగ, పెద్ద జనుము విత్తనాలు అందించడం జరుగుతుంది. ఈ విత్తనాల పంపిణీలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులు, సహకార సంఘం చైర్మన్లు, చొరవ చూపి పరిష్కారం చూపాలని బీజేపీ కామారెడ్డి నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ప్రకటనలో డిమాండ్ చేశారు. నియోజకవర్గ పరిధిలో దాదాపు 60 వేల ఎకరాల్లో వరి ధాన్యం పండిస్తున్నారని వర్షాకాలం ...

Read More »

కామ్రేడ్ జనార్దన్ కు విప్లవ జోహార్లు

నిజామాబాద్‌, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః సీపీఐ (ఎం.ఎల్)న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు కామ్రేడ్ జనార్దన్ సంతాప సభ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎన్.ఆర్ భవన్, కోటగల్లీలో జరిగింది. పార్టీ శ్రేణులు కామ్రేడ్ జనార్దన్ చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు వి.ప్రభాకర్ మాట్లాడుతూ 35 సంవత్సరాలుగా పీడిత ప్రజల కోసం విప్లవోద్యమంలో పనిచేసిన కామ్రేడ్ జనార్దన్ కమ్యూనిస్టు శ్రేణులకు ఆదర్శప్రాయుడన్నారు. కామ్రేడ్ జనార్దన్ సూర్యాపేట ఉమ్మడి నల్గొండ జిల్లా నివాసి అన్నారు. ప్రజలందరూ త‌న‌ను ...

Read More »

సేవాహీ సంఘ‌ట‌న్‌

ఆర్మూర్‌, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః సేవా హి సంఘటన్ కార్యక్రమంలో భాగంగా ఎంపీ అరవింద్‌, జిల్లా అధ్యక్షులు బస్వ లక్ష్మీనరసయ్య ఆదేశాల మేరకు 5 వ రోజు ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి సహకారంతో ఆర్మూర్ పట్టణంలో ఎస్‌సి మోర్చా ఆధ్వర్యంలో కరోనా వల్ల ఆహారం లేక ఇబ్బంది పడుతున్న వారికి, భిక్షాటన చేసే వారికి, నిరుపేదలకు ఆహార పొట్లాలు,వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎస్‌సి మోర్చా పట్టణ అధ్యక్షుడు యుగంధర్, కౌన్సిలర్లు మురళి, సాయి కుమార్, ...

Read More »

దేశానికే అన్నం పెడుతున్న రైతుకు అప్పులు-ఉరి తాళ్ళూ!

బోధ‌న్‌, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే రైతు పంటల కు అవసర మయ్యే 20:20 ,డీఏపీ ,అన్ని కాంప్లెక్స్ ఎరువుల ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచడాన్ని నిరసిస్తూ బోధన్ పట్టణం లోని ఆర్డీవో కార్యాలయం ముందు అఖిలభారత రైతు కూలీ సంఘం (ఏఐకేఏంఎస్) బోధన్ డివిజన్ కమిటీ ఆధ్వర్యం లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐకేఏంఎస్ జిల్లా నాయకులు గుమ్ముల గంగాధర్ మాట్లాడుతూ ప్ర‌స్తుత‌ కరోనా విజృంభన సమయం లో ప్రజలందరూ ...

Read More »

విద్యాశాఖా మంత్రిని మ‌ర్యాద పూర్వ‌కంగా కలిసిన టీయూ వీసీ

డిచ్‌ప‌ల్లి, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖా మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి ని తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ మర్యాద పూర్వకంగా హైదరాబాద్ లోని ఆమె చాంబర్ లో కలిసి పుష్పగుచ్చం అంద‌జేశారు. తెలంగాణ విశ్వవిద్యాలయానికి నాల్గవ రెగ్యూలర్ నూతన ఉపకులపతిగా ఆచార్య డి. రవీందర్ గత శనివారం నియమింపబడిన విషయం విదితమే. ఈ సందర్భంగా వీసీ గురువారం ఉదయం విద్యాశాఖామంత్రి ని మర్యాద పూర్వకంగా కలిశారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి నూతనంగా నియమితులైన ...

Read More »

అత్యవసర సమయంలో రక్తదానం చేసిన యువకుడు

కామారెడ్డి, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కామారెడ్డి దేవునిపల్లి కి చెందిన పంచక్షర్ అనే 60 సంవత్సరాల వృద్దునికి ఆపరేషన్ నిమిత్తం ఏ పాజిటివ్ రక్తం అవసరం ఉంద‌ని కామారెడ్డి జిల్లా రక్తదాతల వాట్సప్ గ్రూప్ లో బుధ‌వారం సాయంత్రం మెసేజ్ చేయగా గ్రూప్ లో ఉన్న కామారెడ్డి కి చెందిన యువకుడు ఆది రక్తదానం చేస్తా అని మాట ఇచ్చి గురువారం ఉదయం వీటి ఠాగూర్ రక్తనిది కేంద్రంలో రక్తదానం చేసి మానవత్వాన్ని చాటాడు. ఈ సందర్భంగా కామారెడ్డి ...

Read More »

సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సిన్ కొరకు 18 కేంద్రాలు

నిజామాబాద్‌, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ఈనెల 28, 29 తేదీలలో సూపర్ స్ప్రెడర్లకు అందించే వ్యాక్సింగ్ కొరకు అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం సివిల్ సప్లై వ్యవసాయ సమాచార పౌర సంబంధాలు వైద్య ఆరోగ్య శాఖ, నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్, ఆర్డివోలు తదితర అధికారులతో ప్రత్యేక వ్యాక్సినేషన్ పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొరకు 28, 29 తేదీలలో 50 ...

Read More »

నిర్జీవంగా ఉన్న దేశాన్ని అభివృద్దివైపు తీసుకెళ్ళారు…

నిజామాబాద్‌, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః గురువారం పండిత్ జవహర్ లాల్ నెహ్రు వర్ధంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నెహ్రూ చిత్రపటానికి పూలమాలవేసి అదేవిధంగా నెహ్రూ పార్క్ లోని నెహ్రూ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఇన్చార్జి తాహెర్బిన్ హందాన్, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశ వేణు పాల్గొని నెహ్రూకి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ ...

Read More »