Breaking News

అత్యవసర సమయంలో రక్తదానం చేసిన యువకుడు

కామారెడ్డి, మే 27

నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కామారెడ్డి దేవునిపల్లి కి చెందిన పంచక్షర్ అనే 60 సంవత్సరాల వృద్దునికి ఆపరేషన్ నిమిత్తం ఏ పాజిటివ్ రక్తం అవసరం ఉంద‌ని కామారెడ్డి జిల్లా రక్తదాతల వాట్సప్ గ్రూప్ లో బుధ‌వారం సాయంత్రం మెసేజ్ చేయగా గ్రూప్ లో ఉన్న కామారెడ్డి కి చెందిన యువకుడు ఆది రక్తదానం చేస్తా అని మాట ఇచ్చి గురువారం ఉదయం వీటి ఠాగూర్ రక్తనిది కేంద్రంలో రక్తదానం చేసి మానవత్వాన్ని చాటాడు.

ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా రక్తదాతల వాట్సప్ గ్రూప్ నిర్వాహకులు ఎనుగందుల నవీన్, బోనగిరి శివకుమార్, కొత్మిర్ కర్ రామకృష్ణ మాట్లాడుతూ స్వచ్చందంగా రక్తదానానికి ముందుకు వచ్చిన ఆది కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వేసవికాలంలో రక్తలేమితో, ఆపరేషన్ నిమిత్తం రక్తం అవసరం ఉంటుంది కాబట్టి రక్తదాతలు ముందుకు వచ్చి ప్రాణదాతలు కావాలని కోరారు.

కార్యక్రమంలో రోగి బంధువులు శివ, వీటి ఠాగూర్ రక్తనిధి కేంద్రం నిర్వాహకులు చందన్, యేసు గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Check Also

డ్రోన్‌ కెమెరాల‌ ద్వారా లాక్‌డౌన్‌ పరిశీల‌న

కామారెడ్డి, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ కేంద్రంలో లాక్‌ డౌన్‌ను మరింత కట్టుదిట్టంగా ...

Comment on the article