Breaking News

ఉర్దూ జ‌ర్న‌లిస్టుకు రూ.5 ల‌క్ష‌లు కేంద్రం ఆర్థిక సహాయం

కామారెడ్డి, మే 27

నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ (టీజేఏ), ఎన్ యూజె (ఐ)న్యూఢిల్లీ వారి కృషి ఫలితంగా బుధవారం కేంద్ర ప్రచార మంత్రిత్వ శాఖ నుండి హైద్రాబాద్ కు చెందిన సీనియర్ ఉర్డు జర్నలిస్ట్ అలం మెహిది కుటుంబానికి 5లక్షల రూపాయలు మంజూరు అయినట్లు ఎన్యూజె (ఐ)న్యూఢిల్లీ మాజీ చైర్మన్ , ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు ఉప్పల లక్ష్మన్ తెలిపారు.

జర్నలిస్ట్ అలం మెహిది మెదటి విదత కోవిడ్ సోకి మృతి చెందారని, ఆయన టీజేఏ సభ్యుడుగా, ఎన్యూజె (ఐ) మాజీ ఉపాధ్యక్షులని తెలిపారు. ఆయన మరణం తరువాత అన్ని ధ్రువీకరణ పత్రాలతో కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖకు దరఖాస్తు చేసుకోగా, అక్కడ అన్ని విధాలా పరిశీలన అనంతరం 5 లక్షలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయినట్లు తెలిపారు.

5 లక్షల నిధులమంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వానికి, ఆర్థిక సహాయం మంజూరుకు కృషి చేసిన ఎన్యూజె (ఐ) మాజీ చైర్మన్ ఉప్పల లక్ష్మణ్ కు, టీజేఏ రాష్ట్ర అధ్యక్షులు పురుషోత్తంకు , రాష్ట్ర కార్యదర్శి ఉక్కల్ కర్ రాజేందర్ నాథ్ లకు అలం మెహిది కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉండగా తెలంగాణ ప్రెస్ అకాడమీ నుండి కూడా 1 లక్ష రూపాయలు మంజూరు చేసినట్లు కుటుంబ సభ్యులు తెలుపుతూ ప్రెస్ అకాడమీ కి కూడా వారు కృతజ్ఞతలు తెలిపారు.

Check Also

డ్రోన్‌ కెమెరాల‌ ద్వారా లాక్‌డౌన్‌ పరిశీల‌న

కామారెడ్డి, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ కేంద్రంలో లాక్‌ డౌన్‌ను మరింత కట్టుదిట్టంగా ...

Comment on the article