Breaking News

దేశానికే అన్నం పెడుతున్న రైతుకు అప్పులు-ఉరి తాళ్ళూ!

బోధ‌న్‌, మే 27

నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే రైతు పంటల కు అవసర మయ్యే 20:20 ,డీఏపీ ,అన్ని కాంప్లెక్స్ ఎరువుల ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచడాన్ని నిరసిస్తూ బోధన్ పట్టణం లోని ఆర్డీవో కార్యాలయం ముందు అఖిలభారత రైతు కూలీ సంఘం (ఏఐకేఏంఎస్) బోధన్ డివిజన్ కమిటీ ఆధ్వర్యం లో నిరసన ప్రదర్శన నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏఐకేఏంఎస్ జిల్లా నాయకులు గుమ్ముల గంగాధర్ మాట్లాడుతూ ప్ర‌స్తుత‌ కరోనా విజృంభన సమయం లో ప్రజలందరూ ఇళ్ళకే పరిమితమైతే, రైతు మాత్రం పంటలు పండించి దేశానికే అన్నం పెడుతుంటే, రైతు పంటకు ఉపయోగించే ఎరువుల ధరలు పెంచి రైతు నడ్డి విరువడం భావ్యమా? ,పాలకులకు ఇది తగునా ? అని ప్రశ్నించారు.

ఇప్పటికే ప్రతినిత్యం పెట్రోల్, డిజీల్ ధరల పెంపు తో సతమత మవుతుంటే ఎరువుల ధరల పెంపు తో రైతు గుభేల్ మంటున్నారని, పెంచిన ఎరువుల ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. మొదలే సాగు వ్యయం పెరిగి, పండించిన పంట లకు గిట్టుబాటు ధర రాక అప్పుల పాలై, ఆత్మహత్యల పాలవుతుంటే, కార్పోరేట్ పరిశ్రమల ఆదాయాలు పెంపున‌కు కృషి చేస్తూ పారిశ్రామిక వేత్తలకు వుడిగం చేస్తున్నారని మండి పడ్డారు.

పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలని, కల్తీ విత్తనాలను అరికట్టాలని, రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయల రుణాన్ని మాఫీ చేసి, కొత్త రుణాల ను ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో ఏఐకేఏంఎస్ బోధన్ డివిజన్ అధ్యక్షుడు పుట్టి నాగన్న, ప్రదాన కార్యదర్శి పార్వతి రాజేశ్వర్, జిల్లా నాయకులు ఒడ్డెన్న, నసీర్, పడాల శంకర్, తాడ్‌బిలోలి సొసైటీ డైరెక్టర్ పొశెట్టి, సుల్తాన్ సాయులు, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Check Also

ప్రజాస్వామ్యం ప్రమాదంలోకి నెట్ట బడుతుంది

బోధన్‌, మార్చ్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీజేపీ పాల‌నలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని ఐఎఫ్‌టీయూ జిల్లా ...

Comment on the article