Breaking News

సీఎం కేసీఆర్ కు దత్తాపూర్ దళిత కుటుంబాల రైతుల లేఖలు

ఆర్మూర్‌, మే 27

నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః మంత్రి ఈటెల రాజేందర్ విషయంలో రైతులు రాసిన లేఖలతో సీఎం కేసీఆర్ రెవెన్యూ యంత్రాంగాన్ని విచారణ చేయాలని ఆదేశించినట్టుగానే, నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం దత్తపూర్ గ్రామ శివారులో గల వ్యవసాయ భూమి విషయంలో కూడా విచారణ చేపట్టాలని ఎమ్ఆర్ పిఎస్ జిల్లా అధ్యక్షులు బాలు గురువారం డిమాండ్ చేశారు.

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట్ మండలం దత్తపూర్ గ్రామంలో ఉన్న 24 ఎకరాల భూమిని స్థానికం గా లేని వేరే గ్రామస్థులైన అధికారపార్టీ కి చెందిన నేతలు అక్రమంగా పట్టా చేసుకున్నారని, ఇది రెవెన్యూ అధికారుల తప్పిదమని, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని, స్థానిక ఎంఎల్ఏ జీవన్‌రెడ్డి కూడా వారికులస్థులు ఉన్నారని నెపంతో ఇప్పటివరకు గ్రామాన్ని సందర్శించడం, పట్టించుకోవడం లేదన్నారు.

దళితుల కు 3 ఎకరాల భూమి ఇస్తానని ఇవ్వలేదని, ఉన్న భూమిని కాస్తా తెరాస నాయకులు అక్రమ పట్టాలు చేసుకొని మాకు అన్యాయం చేస్తున్నారన్నారు. న్యాయం చేయలేని యెడల ప్రగతి భవన్ వద్దకు వస్తామని అక్కడ తాడోపేడో తేల్చుకుంటామని లేఖలో పేర్కొన్నారు.

కార్యక్రమంలో మైలారం బాలు, జిల్లాఅధ్యక్షులు, అబ్బి గంగారాం దళితనాయకులు, సంకేపల్లి విప్లవ్,
అబ్బి ప్రగతి కుమార్, రాజేశ్వర్, గోపి, కుషోల్లా గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Check Also

అందరు తప్పక వ్యాక్సిన్‌ తీసుకోవాలి

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం భారతీయ జనతా పార్టీ మాక్లూర్‌ మండల‌ శాఖ ...

Comment on the article