Breaking News

అవ‌స‌ర‌మైన విత్త‌నాలు స‌ర‌ఫ‌రా చేయాలి

కామారెడ్డి, మే 27

నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కామారెడ్డి నియోజకవర్గ పరిధిలో గత రెండు రోజులుగా దాదాపు అన్ని సహకార సంఘాల వద్ద జీలుగ, పెద్ద జనుము విత్తనాలు అందించడం జరుగుతుంది. ఈ విత్తనాల పంపిణీలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులు, సహకార సంఘం చైర్మన్లు, చొరవ చూపి పరిష్కారం చూపాలని బీజేపీ కామారెడ్డి నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ప్రకటనలో డిమాండ్ చేశారు.

నియోజకవర్గ పరిధిలో దాదాపు 60 వేల ఎకరాల్లో వరి ధాన్యం పండిస్తున్నారని వర్షాకాలం వరి వేసే ముందు కృత్తిమ ఎరువుగా జీలుగ, పెద్ద జనములు విత్తుతారని ఒక బస్తా 2 నుండి రెండున్నర ఎకరాల కు సరిపోతుంది కావున కామారెడ్డి నియోజకవర్గానికి దాదాపు 12000 క్వింటాళ్ల విత్తనాలు అవసరం కాగా కేవలం 2500 క్వింటాళ్ల విత్తనాలు మాత్రమే వచ్చాయని అన్నారు.

రైతే రాజు అంటున్నారు కానీ ఇక్కడ ప్రణాళిక లోపం వ్యవసాయ, సహకార సంఘ అధికారులదా లేక సహకార సంఘ చైర్మన్లు, డైరెక్టర్ లేదా అని ప్రశ్నించారు. ఒక్కో రైతు అన్ని పనులు వదులుకొని ఉదయం 4 గంటల నుండి లైన్లలో నిలబడటం కలచివేసిందని లోపభూయిష్టమైన అధికారుల, పాలకుల ప్రణాళికల వల్ల రైతుకు అడుగడుగునా అడ్డంకులె ఎదురవుతున్నాయని అన్నారు.

ఇకనైనా అధికారులు ప్రతి రైతుకు అవసరం ఉన్నన్ని జీలుగ, పెద్ద జనుము విత్తనాల సరఫరా అయ్యేలా చూడాలన్నారు.

Check Also

డ్రోన్‌ కెమెరాల‌ ద్వారా లాక్‌డౌన్‌ పరిశీల‌న

కామారెడ్డి, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ కేంద్రంలో లాక్‌ డౌన్‌ను మరింత కట్టుదిట్టంగా ...

Comment on the article