Breaking News

వర్షాకాలంలో నీటిని తోడేందుకు పల్లికొండ లిఫ్ట్ పూర్తి సిద్ధం

భీమ్‌గ‌ల్‌, మే 27

నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని భీంగల్, వేల్పూర్ మండలాల్లో రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గురువారం పర్యటించారు.

ముందుగా వేల్పూర్ మండలం జానకం పేట గ్రామం మల్లాడీ చెరువుని పాత నిజాంసాగర్ కెనాల్ నుండి నింపడానికి ఫీడర్ చానల్ లో కొంత భాగము పైప్ లైన్ వేయాల్సిన అవసరం ఉండటంతో పైప్ లైన్ వేయాల్సిన ఫీడర్ చానల్ స్థలాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. నిధుల మంజూరుకు కృషి చేస్తానని గ్రామస్థులకు హామీ ఇచ్చారు.

అనంతరం పల్లికొండ(వేంగంటి) ప్రాజెక్టు కింద ఉన్న లిఫ్ట్ ను పరిశీలించారు.మోటర్ల పనితీరు అధికారులను అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలంలో నీటిని తోడేందుకు సిద్ధంగా ఉండాలని ఇరిగేషన్ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. పైప్ లైన్ లీకేజీలు,లిఫ్ట్ మోటర్ల చిన్న చిన్న మరమ్మత్తులు వారంలోగా పూర్తి చేసి నీటిని లిఫ్ట్ చేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పారు.

అనంతరం పల్లికొండ చెరువును పరిశీలించారు.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు కాళేశ్వరం ద్వారా, తెలంగాణ లోని లిఫ్ట్ ల ద్వారా చెరువులను నింపుకోవాలనే ఆలోచన చేయడంతో నియోజకవర్గంలో ని వేముగంటి, పల్లికొండ ఎత్తిపోతల యొక్క మోటార్లు ని పరిశీలించామన్నారు.ఇక్కడి రైతులు దీనికి సంబంధించిన విషయాలు ఆయన దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు.

క్షేత్రస్థాయిలో పరిశీలించి వర్షాకాలం ఆరంభంలోనే నీటిని ఎత్తిపోసేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకి సూచించినట్లు తెలిపారు. పల్లికొండ ఎత్తిపోతల పథకం ద్వారా దిగువన ఉన్న సుమారు 7 గ్రామాల చెరువులు నింపేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి సూచించారు.ఇప్పటికే గత సంవత్సరం పల్లికొండ లిఫ్ట్ ద్వారా పల్లికొండ, సుద్దపల్లి, పురాన్ పేట చెరువులు నింపుకున్నామని గుర్తు చేశారు.

మిగతా గ్రామాలకు కూడా సాగు నీరు అందించడమే లక్ష్యమన్నారు.అనంతరం పల్లికొండ, బాచన్ పల్లి, ముచ్కూర్ చెరువులు పరిశీలించారు. చెరువు కట్టల పై బైక్ పై కలియతిరుగుతూ చెరువుల నాణ్యత, నీటిని నింపుకునేందుకు వీలుపడే ఫీడర్ ఛానల్ లను పరిశీలించారు.రైతులతో ముచ్చటించారు. బాచన్‌ప‌ల్లి, పిప్రి చెరువు ఫీడర్ చానల్ కు స్థలాన్ని పరిశీలించారు. బషీరాబాద్ కాడిచేరు వద్ద రామన్నపేట కొత్త చెరువు నింపే డిసి (డిస్ట్రిబ్యూటరీ ఛాంబర్) ఫీడర్ చానల్ పరిశీలన, రామన్నపేట కొత్త చెరువు పరిశీలన చేశారు.

ఆయా గ్రామాల్లో ఆశావర్కర్లు, ఎఎన్ఏంలతో మాట్లాడిన మంత్రి

సాగునీటికి సంబంధించిన కాలువల పరిశీలనకు వెళ్తుండగా మార్గమధ్యలో జ్వ‌ర‌ సర్వే చేస్తున్న ఆశా వర్కర్లు, ఏఎఎన్ఎంలు కనిపించారు.దేవన్ పల్లి, కారేపల్లి, రహ్మత్ నగర్, పల్లికొండ, బాచన్ పల్లి తో పాటు ఆయా గ్రామాల్లో కోవిడ్ సోకిన వారి లక్షణాలు ఉన్న వారి వివరాలు తెలుసుకున్నారు.

రెండో దఫా ఇంటింటి సర్వేలో ఎంతమందికి లక్షణాలు బయటపడ్డాయని వాకబు చేసారు. బాగా పనిచేస్తున్నారని వారిని ప్రశంసించారు. గ్రామ పంచాయతీల్లో కోవిడ్ మెడిసిన్ కిట్లు అందుబాటులో ఉంచుకోవాలని గ్రామ సర్పంచ్ లకు సూచించారు.

ఆయా గ్రామాల సర్పంచ్ లు, వార్డు మెంబర్లు లాక్ డౌన్ పక్కాగా అమలు అయ్యేటట్టు చూడాలని అన్నారు. అప్పుడే కోవిడ్ ని నియంత్రించగలుగుతామని చెప్పారు. ప్రజలు కూడా అందుకు సహకరించాలని కోరారు.

మంత్రి వెంట పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.

Check Also

ఆర్మూర్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షునిగా చిలుక కిష్టయ్య

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుగా ఎన్నికైన చిలుక కిష్టయ్యని ...

Comment on the article