Breaking News

కామ్రేడ్ జనార్దన్ కు విప్లవ జోహార్లు

నిజామాబాద్‌, మే 27

నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః సీపీఐ (ఎం.ఎల్)న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు కామ్రేడ్ జనార్దన్ సంతాప సభ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎన్.ఆర్ భవన్, కోటగల్లీలో జరిగింది. పార్టీ శ్రేణులు కామ్రేడ్ జనార్దన్ చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు.

ఈ సందర్భంగా న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు వి.ప్రభాకర్ మాట్లాడుతూ 35 సంవత్సరాలుగా పీడిత ప్రజల కోసం విప్లవోద్యమంలో పనిచేసిన కామ్రేడ్ జనార్దన్ కమ్యూనిస్టు శ్రేణులకు ఆదర్శప్రాయుడన్నారు. కామ్రేడ్ జనార్దన్ సూర్యాపేట ఉమ్మడి నల్గొండ జిల్లా నివాసి అన్నారు. ప్రజలందరూ త‌న‌ను జన్ను సార్ అని ప్రేమగా పిలిచేవారన్నారు.

ఆయన ఉమ్మడి నల్గొండ జిల్లా కార్యదర్శిగా, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా పని చేస్తున్నారన్నారు. ఉమ్మడి నల్గొండ విప్లవ ఉద్యమ చరిత్రలో కామ్రేడ్ జనార్దన్ అగ్రభాగాన ఉంటాడన్నారు. కామ్రేడ్ జనార్దన్ మరణం ఉమ్మడి నల్గొండ జిల్లాకు తీరని లోటన్నారు. సిద్ధాంతము, ఆచరణ, కార్యాచరణ కలిసున్న ఆదర్శ కమ్యూనిస్టు కామ్రేడ్ జనార్దన్ అని అన్నారు.

దోపిడీ, పీడన లేని సమ సమాజాన్ని కలలుగన్న జనార్ధన్ ఆశయాల వెలుగులో ముందుకు వెళతామన్నారు. అదే కామ్రేడ్ జనార్ధన్ అన్నకు నిజమైన విప్లవం నివాళి అన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు పాపయ్య, ఎం.నరేందర్, డి.రాజేశ్వర్, వెంకన్న, గోదావరి సుధాకర్, కిషన్, నర్సక్క, విటల్, చరణ్, రాజు తదితరులు పాల్గొన్నారు.

Check Also

మొబైల్‌ కూరగాయల‌ వాహనాలు ప్రారంభం

నిజామాబాద్‌, మే 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొనసాగుతున్న లాక్‌ డౌన్‌ ను ద ృష్టిలో పెట్టుకొని ...

Comment on the article