Breaking News

సేవాహీ సంఘ‌ట‌న్‌

ఆర్మూర్‌, మే 27

నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః సేవా హి సంఘటన్ కార్యక్రమంలో భాగంగా ఎంపీ అరవింద్‌, జిల్లా అధ్యక్షులు బస్వ లక్ష్మీనరసయ్య ఆదేశాల మేరకు 5 వ రోజు ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి సహకారంతో ఆర్మూర్ పట్టణంలో ఎస్‌సి మోర్చా ఆధ్వర్యంలో కరోనా వల్ల ఆహారం లేక ఇబ్బంది పడుతున్న వారికి, భిక్షాటన చేసే వారికి, నిరుపేదలకు ఆహార పొట్లాలు,వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు.

కార్యక్రమంలో ఎస్‌సి మోర్చా పట్టణ అధ్యక్షుడు యుగంధర్, కౌన్సిలర్లు మురళి, సాయి కుమార్, క్రాంతి, ప్రదీప్, ఎస్‌టి మోర్చా కార్యదర్శి దరావత్ మోహన్ పాల్గొన్నారు.

Check Also

అందరు తప్పక వ్యాక్సిన్‌ తీసుకోవాలి

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం భారతీయ జనతా పార్టీ మాక్లూర్‌ మండల‌ శాఖ ...

Comment on the article