Breaking News

నిర్జీవంగా ఉన్న దేశాన్ని అభివృద్దివైపు తీసుకెళ్ళారు…

నిజామాబాద్‌, మే 27

నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః గురువారం పండిత్ జవహర్ లాల్ నెహ్రు వర్ధంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నెహ్రూ చిత్రపటానికి పూలమాలవేసి అదేవిధంగా నెహ్రూ పార్క్ లోని నెహ్రూ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఇన్చార్జి తాహెర్బిన్ హందాన్, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశ వేణు పాల్గొని నెహ్రూకి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశం మొదటి ప్రధానిగా నెహ్రూ గారు బాధ్యతలు తీసుకున్న తరువాత బ్రిటిష్ వారు వెళ్ళి పోతూ ఈ దేశాన్ని దుర్భరమైన పరిస్థితిలో వదిలిపెట్టారని, అలాంటి సమయంలో దేశం అభివృద్ధి వైపు సాగాలంటే కార్యాచరణే ముఖ్యమని నెహ్రు గారు కూడు ,గుడ్డ ,ఇల్లు మూడు ప్రాతిపాదికన దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సఫలమైన వ్యక్తి అని, ప్రపంచంలో విజయవంతమైన ప్రధానమంత్రి నెహ్రు గారు అని, నెహ్రు తీసుకున్న నిర్ణయాలు సాగునీటి రంగంలో ప్రాజెక్టులు, పారిశ్రామిక రంగంలో ఫ్యాక్టరీలు, విద్యారంగంలో నిమ్స్, ఐఐటి లాంటి ఉన్నత విద్యా సంస్థలు ఏర్పాటు చేసినటువంటి మహోన్నత వ్యక్తి నెహ్రు అని అన్నారు.

కానీ దురదృష్టకరం ఇప్పుడు దేశానికి ప్రధానమంత్రి, హోంమంత్రి ఇద్దరు కూడా దేశ అభివృద్ధిని దిగజారుస్తున్నారని, తడిపార్ కు గురైనటువంటి వ్యక్తి ఈ దేశ హోంమంత్రి అమిత్ షా అని, ఈ దేశంలోనే అతిపెద్ద మారణకాండను (గోద్రా అల్లర్లను) సృష్టించినటువంటి వ్యక్తి ప్రధానమంత్రి మోడీ అని వీరిద్దరూ చేసినటువంటి దుర్మార్గాలు ప్రజలను మభ్యపెడుతూ అధికారంలోకి వచ్చినటువంటి వీరిద్దరూ నెహ్రు ని తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారని అది వాళ్ళు ఆకాశం పై ఉమ్మి వేస్తే వాళ్ళ మీద పడుతుందని మానాల మోహన్ రెడ్డి అన్నారు.

నెహ్రు హయంలో నిర్జీవంగా ఉన్న దేశాన్ని అభివృద్ధి వైపు తీసుకువెళ్లడం జరిగిందని, ఇప్పుడు మోడీ అభివృద్ధి వైపు ఉన్న దేశాన్ని ఏడు సంవత్సరాల కాలంలో అందపాతాళానికి తీసుకువెళ్లడం జరుగుతుందని దీనిని దేశ ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు.

కేవలం బీజేపీ వాళ్ళు నెహ్రు ని తక్కువ చేయడం వల్ల వారు బాగుపడతారు అనుకుంటే అది వారి మూర్ఖత్వం తప్ప ఇంకేమీ లేదని, కేవలం ఇద్దరూ ఒకరు మారణహోమం చేసే హోంమంత్రి, ఇంకొకరు మారణకాండను సృష్టించే ప్రధానమంత్రి వీరిద్దరు ద్వారానే ప్రస్తుతం దేశం అందపాతాళానికి ప్రయాణం చేస్తుందని సొంత పార్టీ వారే విమర్శలు చేసే స్థాయికి దిగజారారని ,కావున వారి పాలన ఎలా ఉందో ప్రజలు గమనించాలని, కాంగ్రెస్ నాయకులు, జిల్లా ప్రజలు నెహ్రూ ఆలోచనా విధానాలను ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని మానాల మోహన్ రెడ్డి అన్నారు.

కార్యక్రమంలో ఎన్ఎస్‌యుఐ జిల్లా అధ్యక్షులు వేణు రాజు, ఓబిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజా నరేందర్ గౌడ్, నగర కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు రాజ్ గగన్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు సిరికొండ గంగారెడ్డి, మధుసూదన్, నవాజ్, ముస్తఫా, ప్రమోద్, సుధాకర్ త‌దితరులు పాల్గొన్నారు.

Check Also

మొబైల్‌ కూరగాయల‌ వాహనాలు ప్రారంభం

నిజామాబాద్‌, మే 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొనసాగుతున్న లాక్‌ డౌన్‌ ను ద ృష్టిలో పెట్టుకొని ...

Comment on the article