Breaking News

జర్నలిస్టు బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం

ఆర్మూర్‌, మే 27

నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జర్నలిస్ట్ బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ప్రెస్ క్లబ్ ఆర్మూర్ అధ్యక్షుడు గుమ్మడి శంకర్ అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ గ్రామంలో గల మహిళ సమాఖ్య భవనంలో గురువారం ఇటీవల మృతి చెందిన ఇద్దరు జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేశారు.

ప్రెస్ క్లబ్ కార్యవర్గం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా మృతి చెందిన రాచర్ల రాజేశ్వర్, ఆల్గోట్ జ్ఞానేశ్వర్ ఆత్మలకు శాంతి చేకూర్చాలని తెలియజేస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం ఆయన మాట్లాడారు.

కరోనా వ్యాధి బారినపడి అకాల మరణం పొందిన జర్నలిస్టుల కుటుంబాలకు ప్రెస్ క్లబ్ ఆర్మూర్ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దీనిలో భాగమే జర్నలిస్టు సోదరులు, దాతలు తోచిన తనవంతు సహకారానికి అభినందించారు. ఆర్థిక సహాయం అందజేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ కార్యవర్గం పిలుపు మేరకు ఆర్థిక సహాయం అందించడానికి ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరిని అభినందించారు. ప్రెస్ క్లబ్ కోశాధికారి కోడే స్వామి మాట్లాడుతూ తోటి జర్నలిస్టులు అకాల మరణం చెందడం బాధాకరంగా ఉందన్నారు. ప్రెస్ క్లబ్ ఆర్మూర్ ఉపాధ్యక్షులు,కార్యవర్గ సభ్యులు,సలహాదారులు బాధిత కుటుంబాలను ఉద్దేశించి మాట్లాడారు.

అనంతరం విరాళాలు సేకరించిన ఇద్దరు కుటుంబాలకు 55 వేల చొప్పున 11లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్స్ డాక్యుమెంట్స్ అందించారు. అదేవిధంగా ఒక్కో కుటుంబానికి 3వేల రూపాయల చొప్పున ఆరువేల నగదు అందజేశారు.

ఆర్థిక సహాయం అందజేసిన ప్రెస్ క్లబ్ ఆర్మూర్ కార్యవర్గానికి, జర్నలిస్టులకు, విరాళాలు అందజేసిన ప్రతి ఒక్కరికి విరాళం పొందిన వారు కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు రాజేందర్, ప్రశాంత్, బొడ్డు గోపి, జోయల్ చంద్ర, గోలి పురుషోత్తం, సైఫ్ అలీ, నరేందర్, చిరంజీవి, హమ్మద్ అలీ, గంగా మోహన్, సంజీవ్, అయ్యాడి సురేష్, శ్రావణ్, గణేష్ గౌడ్, అజీమ్, విన్సెంట్, గంగా ప్రసాద్, వంశీ, శ్రీకాంత్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Check Also

అందరు తప్పక వ్యాక్సిన్‌ తీసుకోవాలి

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం భారతీయ జనతా పార్టీ మాక్లూర్‌ మండల‌ శాఖ ...

Comment on the article