Breaking News

వృద్ధ కళాకారుల పెన్షన్ రూ. 3016 కు పెంపుద‌ల‌

హైద‌రాబాద్‌, మే 27

నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః గురువారం తెలంగాణ రాష్ట్రం లో వృద్ధ కళాకారులకు 1500 వందల రూపాయల నుండి రూపాయలు 3016 కు వృధ్యాప్య పెన్షన్లు పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కి రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.

పెంచిన వృద్ధ కళాకారుల పెన్షన్లు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2 – 2021 నుండి కళాకారులకు వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

పెంచిన వృధ్యాప్య పెన్షన్లు వల్ల 2661 మంది వృద్ధకళాకారులకు ప్రయోజనం కలుగుతుందన్నారు మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్.

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కళా ప్రియుడు, సాహితీవేత్త, కళాకారులంటే ఎంతో గౌరవం ఉన్న నాయకుడు కావడం వల్ల వృద్ధ కళాకారుల పెన్షన్ ను 1500 రూపాయల నుండి 3016 రూపాయల (రెట్టింపు పెన్షన్) ను పెంచి కళాకారుల వికాసం కోసం కృషి చేస్తున్నామన్నారు.

Check Also

సిఎం కెసిఆర్ కీల‌క నిర్ణయం తీసుకున్నారు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా అనూహ్యంగా విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజల‌కు వైద్యాన్ని ...

Comment on the article