Breaking News

విద్యాశాఖా మంత్రిని మ‌ర్యాద పూర్వ‌కంగా కలిసిన టీయూ వీసీ

డిచ్‌ప‌ల్లి, మే 27

నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖా మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి ని తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ మర్యాద పూర్వకంగా హైదరాబాద్ లోని ఆమె చాంబర్ లో కలిసి పుష్పగుచ్చం అంద‌జేశారు.

తెలంగాణ విశ్వవిద్యాలయానికి నాల్గవ రెగ్యూలర్ నూతన ఉపకులపతిగా ఆచార్య డి. రవీందర్ గత శనివారం నియమింపబడిన విషయం విదితమే. ఈ సందర్భంగా వీసీ గురువారం ఉదయం విద్యాశాఖామంత్రి ని మర్యాద పూర్వకంగా కలిశారు.

మంత్రి సబితా ఇంద్రారెడ్డి నూతనంగా నియమితులైన వీసీ డి. రవీందర్ కి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ విశ్వవిద్యాలయాన్ని అకడమిక్ పరంగా అభివృద్ది పరచాలని సూచించారు. ఉన్నత విద్య, పరిశోధనా రంగాలలో విస్తృతమైన కృషి చేసి తెలంగాణ విశ్వవిద్యాలయాన్ని ముందంజలో నిలపాలని కోరారు.

విశ్వవిద్యాలయాలలో ఉన్నతమైన విద్యా ప్రమాణాలను పెంపొందించే విధంగా సుహృద్భావ వాతావరణం కల్పించాలని ఆమె తెలిపారు. విశ్వవిద్యాలయ అభివృద్ధిలో ప్రభుత్వం పరంగా పూర్తి సహకారం అందిస్తామని అన్నారు.

తనను తెలంగాణ విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా నియమించినందుకు ఆచార్య డి. రవీందర్ రాష్ట్ర విద్యాశాఖా మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article