Breaking News

మిగ‌తా ల‌క్ష్యాన్ని త్వ‌ర‌లో పూర్తి చేస్తాం..

కామారెడ్డి, మే 27

నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జిల్లాలో ఇప్పటి వరకు 3 లక్షల 87 వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు జరిగినట్లు జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్ తెలిపారు.

గురువారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ టెలికాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో ధాన్యం కొనుగోళ్లపై జిల్లాల వారిగా సమీక్షించారు. వర్షాకాలం సమీపిస్తున్నందున ధాన్యం కొనుగోళ్లు వేగంగా పూర్తి చేసుకోవాలని, రైతుల నుండి కొనుగోలు కాగానే వెంటనే వారి ఖాతాలలో డబ్బు జమ అయ్యేలా చూడాలని తెలిపారు.

జిల్లా కలెక్టరు జిల్లాలో కొనుగోళ్ల వివరాలు తెలుపుతూ, ఇప్పటి వరకు 342 కొనుగోలు కేంద్రాల ద్వారా 60 వేల మంది రైతుల నుండి 3 లక్షల 87 వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని, 560 కోట్లు రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగిందని, మిగతా లక్ష్యాన్ని కూడా త్వరలోనే పూర్తి చేయడం జరుగుతుందని వివరించారు.

Check Also

డ్రోన్‌ కెమెరాల‌ ద్వారా లాక్‌డౌన్‌ పరిశీల‌న

కామారెడ్డి, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ కేంద్రంలో లాక్‌ డౌన్‌ను మరింత కట్టుదిట్టంగా ...

Comment on the article