Breaking News

Daily Archives: May 28, 2021

అటవీ భూముల ఆక్రమణలు అరికట్టాలి

కామారెడ్డి, మే 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః అటవీ భూముల ఆక్రమణలను అరికట్టాలని, వృక్షజాతిని కాపాడాలని జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఫారెస్టు, రెవిన్యూ, పోలీసు అధికారులతో కూడిన జిల్లా అటవీ సంరక్షణ కమిటీలో అటవీ భూముల పరిరక్షణపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అటవీ భూముల సమస్యలకు సంబంధించి రెవిన్యూ, ఫారెస్టు శాఖలు జాయిట్ సర్వేల ద్వారా అటవీ భూములను గుర్తించాలని, అటవీ భూముల ఆక్రమణను అరికట్టాలని ఆదేశించారు. అడవులలో చెట్టు నరకబడకుండా చూడాలని, ...

Read More »

వానా కాలం సాగుకు విత్తనాలు, ఎరువుల కొరత లేదు

కామారెడ్డి, మే 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః వచ్చే వానా కాలం సాగుకు విత్తనాలు, ఎరువుల కొరత లేదని జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్ తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టరు తన క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టరు డాక్టర్ కె.కేశవులు, ఉమ్మడి జిల్లాల విత్తనాభివృద్ధి సంస్థ రీజినల్ మేనేజరు కె.విష్ణువర్ధన్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, మార్్క ఫెడ్ మేనేజరు జితేందర్, వ్యవసాయ అధికారులతో వానాకాలం సాగు కావలసిన విత్తనాలు, ఎరువులపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా ...

Read More »

క‌రోనా బాధితునికి ఆక్సీజ‌న్ అంద‌జేత

కామారెడ్డి, మే 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ఆక్సిజన్‌ సిలిండర్లు అందజేస్తున్న మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహ్మద్ అలీ షబ్బీర్ వారి షబ్బీర్ అలీ ఫౌండేషన్ ద్వారా కరోనా బాధితులకి సమయానికి కాంగ్రెస్ నాయకులు ఆక్సిజన్ సిలిండర్ అందించి ప్రాణాలు కాపాడారు. కామారెడ్డి పట్టణానికి చెందిన స్వాతంత్ర సమర యోధుడు ఇసన్నపల్లీ నారాయణరెడ్డి కుమారుడు భూమన్న కరోన వ్యాధితో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి శ్వాస తీసుకోలేక బాధపడుతున్నాడు. విష‌యం తెలుసుకున్న ఫౌండేష‌న్ ప్ర‌తినిధులు ఆక్సిజన్ సిలిండర్ అందించి ...

Read More »

చెక్కులు పంపిణీ చేసిన ఎంఎల్ఏ

కామారెడ్డి, మే 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః శుక్ర‌వారం రామరెడ్డి మండలంలోని గొల్లపల్లి కి చెందిన వారికి ఎమ్మెల్యే జాజ‌ల సురేంద‌ర్ కళ్యాణ లక్మి చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమములో మండల ఎంపీపీ దశరత్ రెడ్డి, వైస్ ఎంపీపీ మాజీ జడ్పీటీసీ రాజేశ్వర్ దాదా, మండల రైతు బంధు అధ్యక్షుడు నారాయణరెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచులు, మండల నాయకులు పాల్గొన్నారు.

Read More »

మానుకోట స్ఫూర్తిగా ముందుకు సాగుదాం..

కామారెడ్డి, మే 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః మానుకోట సంఘటన జరిగి నేటికి 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కామారెడ్డి జిల్లా తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో అమరవీరుల స్థూపం ద‌గ్గర ఘనంగ నివాళులర్పించారు. కామారెడ్డి జిల్లా తెలంగాణ జనసమితి నాయకుడు కుంభాల లక్ష్మణ్ యాదవ్ మాట్లాడుతూ కోదండరామ్ పిలుపుమేరకు అమరవీరులకు నివాళులర్పించిన‌ట్టు తెలిపారు. 2010 మే 28 నాటికి మానుకోట సంఘటన జరిగి 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆనాటి సంఘటన గుర్తు చేసుకోవడం జరిగింద‌న్నారు. ముఖ్యంగా జెఏసి నాయకులు యువత ...

Read More »

వివేకానంద విద్యాపథకం దరఖాస్తు గడువు పెంపు

హైదరాబాద్‌, మే 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః రాష్ట్రంలోని బాహ్మ్రణ విద్యార్థులు విదేశీ విద్యను అభ్యసించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివేకానంద విదేశీ విద్యా పథకం దరఖాస్తు గడువును పొడిగించినట్లు తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ బుధవారం తెలిపింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది. గడువును ఈ నెల 28 నుంచి వచ్చే నెల 18 వరకు పొడిగించినట్లు వెల్లడించింది.

Read More »

ఎంసెట్‌ దరఖాస్తు గడువు పెంపు

హైదరాబాద్‌, మే 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ఎంసెట్‌కు ఆలస్య రుసుం లేకుండా దరఖాస్తు చేసుకునే గడువును రెండో సారి పొడిగించారు. గతంలో పెంచిన గడువు బుధవారంతో ముగియగా.. దాన్ని జూన్‌ 3వ తేదీ వరకు పొడిగించినట్లు ఎంసెట్‌ కన్వీనర్‌ ఆచార్య గోవర్ధన్‌ తెలిపారు. లాసెట్‌ దరఖాస్తుల గడువు కూడా.. ఆలస్య రుసుం లేకుండా లాసెట్‌కు దరఖాస్తు చేసుకునే గడువును జూన్‌ 3వ తేదీ వరకు పొడిగించారు. ఈ మేరకు లాసెట్‌ కన్వీనర్‌ జీబీ రెడ్డి బుధవారం ఒక ప్రకటన విడుదల ...

Read More »

పట్టణ విద్యార్థులకూ వ్యవసాయ డిప్లొమా సీట్లు

హైదరాబాద్‌, మే 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః వ్య‌వసాయ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నిబంధనలను మారుస్తూ ఆచార్య జయశంకర్‌ వర్సిటీ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. పదో తరగతి వరకూ గ్రామీణ ప్రాంతాల్లో చదివిన వారికే ఇప్పటివరకూ ఈ కోర్సుల్లో సీట్లు కేటాయిస్తున్నారు. ఈ ఏడాది నుంచి ఈ సీట్లలో 60 శాతం గ్రామీణ ప్రాంతాల వారికి, 40 శాతం పట్టణ ప్రాంతాల వారికి ఇస్తామని వర్సిటీ రిజిస్ట్రార్‌ సుధీర్‌కుమార్‌ బుధవారం తెలిపారు. పాలీసెట్‌ ర్యాంకుల ఆధారంగా ఈ సీట్లు కేటాయిస్తామని, ఇంటర్‌ ...

Read More »

ఆహార భద్రతలో తెలంగాణ భేష్

హైద‌రాబాద్‌, మే 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ఆకలి, పోషకాహార లోపం సమస్యల పరిష్కారంలో తెలంగాణ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తోందని ఐక్యరాజ్య సమితికి చెందిన ప్రపంచ ఆహార కార్యక్రమం బృందం ప్రశంసించింది. ఇండియా నుంచి ఆకలి, పోషకాహారలోపం సమస్యలను పారదోలడానికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు, ఎన్.జి.వో లు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచ ఆహార కార్యక్రమం భారత డైరెక్టర్ బిషో పారాజు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితతో గురువారం వర్చువల్ మీటింగ్ లో ఆహార కార్యక్రమం బృందం మాట్లాడింది. ...

Read More »