Breaking News

పట్టణ విద్యార్థులకూ వ్యవసాయ డిప్లొమా సీట్లు

హైదరాబాద్‌, మే 28

నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః వ్య‌వసాయ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నిబంధనలను మారుస్తూ ఆచార్య జయశంకర్‌ వర్సిటీ పాలకమండలి నిర్ణయం తీసుకుంది.

పదో తరగతి వరకూ గ్రామీణ ప్రాంతాల్లో చదివిన వారికే ఇప్పటివరకూ ఈ కోర్సుల్లో సీట్లు కేటాయిస్తున్నారు. ఈ ఏడాది నుంచి ఈ సీట్లలో 60 శాతం గ్రామీణ ప్రాంతాల వారికి, 40 శాతం పట్టణ ప్రాంతాల వారికి ఇస్తామని వర్సిటీ రిజిస్ట్రార్‌ సుధీర్‌కుమార్‌ బుధవారం తెలిపారు. పాలీసెట్‌ ర్యాంకుల ఆధారంగా ఈ సీట్లు కేటాయిస్తామని, ఇంటర్‌ చదివిన వారు సైతం ఈ ర్యాంకు పొందితే సీట్లు ఇస్తామని చెప్పారు.

Check Also

కోవిడ్‌ చికిత్సకు మోడల్‌ స్కూల్స్‌, కెజిబివిలు, సంక్షేమ గురుకులాలు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ వైరస్‌ ఉద్ధృతికి అనుగుణంగా జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు ...

Comment on the article